ఫొటోషూట్‌ల‌తో మ‌ళ్లీ హీటు పెంచేస్తోంది!

-

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నాపేరెంట్స్ ఇటీవ‌ల కోవిడ్ భారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ట్రీట్‌మెంట్ అనంత‌రం వారు కోలుకోవ‌డంతో తెలుగు మూవీ షూటింగ్ కోసం హైద‌రాబాద్ వ‌చ్చేసింది త‌మ‌న్నా. ఇక్క‌డికి వ‌చ్చాక క‌రోనా వైర‌స్ సిమ్ట‌మ్స్ క‌నిపించ‌డంతో టెస్ట్‌లు చేయించుకున్న త‌మ‌న్నాకు క‌రోనా సోకిన‌ట్టు తేలింది. దీంతో ఇక్క‌డే ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంది.

- Advertisement -

14 రోజుల త‌రువాత కోలుకోవ‌డంతో తిరిగి ముంబై వెళ్లిపోయింది. అప్ప‌టి నుంచి ఇంటి ప‌ట్టునే వుంటూ రిలాక్స్ అవుతోంది. సంపూర్ణంగా కోలుకున్న త‌మన్నా తాజాగా ఫొటో షూట్‌ల‌కు పోజు లిచ్చింది. షార్ట్ లో వైట్ ష‌ర్ట్ ధ‌రించి త‌మ‌న్నా ఫొటోల‌కు పోజులిచ్చింది. దీనికి సంబంధించిన స్టిల్స్ ని ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఈ సంద‌ర్భంగా ఫొటో షూట్ నిర్వ‌హించిన ఫొటోగ్రాఫ‌ర్ అవినాష్ గొవారిక‌ర్ కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఈ ఫొటో షూట్‌లో నా నిజ‌మైన రూపాన్ని మ‌రింత అందంగా కాప‌ష‌ర్ చేసినందుకు ధ‌న్య‌వాదాలు` అని ఫొటోలకు క్యాప‌ష‌న్ ఇచ్చింది.

ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న‌ వెబ్ సిరీస్ కోసం షూటింగ్ చేస్తున్నప్పుడు తమన్నా కరోనా వైరస్ బారిన ప‌డింది. హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందిన తరువాత తిరిగి ముంబై వెళ్లిపోయింది. ఈ నెల చివర్లో త‌మ‌న్నా తిరిగి వెబ్ సిరీస్‌ షూట్‌లో చేరబోతోంది.

https://www.instagram.com/p/CHHsrophIpn/

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...