రాజమౌళిని కాకపడుతున్న తమన్నా..!

-

దశాబ్ధ కాలం నుండి హీరోయిన్ గా కెరియర్ సాగిస్తున్న మిల్కీ బ్యూటీ తమన్నా కుదిరితే హీరోయిన్ లేదంటే ఐటం సాంగ్స్ అంటూ మంచి ఫాంలో ఉంది. అయితే బాహుబలి ముందు వరకు కెరియర్ కాస్త అటు ఇటుగా ఉన్న అమ్మడు ఆఫ్టర్ బాహుబలి మళ్లీ ఊపందుకుంది. అందుకే రాజమౌళి తనకు బాహుబలి ఛాన్స్ ఇవ్వడం గురించి గొప్పగా చెబుతుంది. అలాంటి సినిమాలో మంచి పాత్ర ఇచ్చినందుకు రాజమౌళి సార్ కు ఎన్ని థ్యాంక్స్ లు చెప్పినా సరిపోవని అంటుంది.

సినిమా వచ్చిన ఇన్నాళ్లకు తమన్నా రాజమౌళిని పొగడటం చూస్తుంటే బాహుబలి లానే కుదిరితే ఆర్.ఆర్.ఆర్ లో కూడా తనని తీసుకోమని హింట్ ఇస్తున్నట్టు ఉంది. బాహుబలి తరహాలోనే ట్రిపుల్ ఆర్ ను ప్లాన్ చేస్తున్నాడు. ఈమధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్లిన జక్కన్న బాహుబలికి ఏమాత్రం తీసిపోని విధంగా ఆర్.ఆర్.ఆర్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. మరి రాజమౌళిని కాకాపడుతున్న తమన్నాకి ఆర్.ఆర్.ఆర్ లో ఛాన్స్ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news