టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ దాడులు చేస్తోందని.. తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించొద్దని లోకేశ్ ఇటీవల ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ట్వీట్లపై హోంమంత్రి సుచరిత స్పందించారు.
ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయి. ఏపీలో ఎటువంటి అలజడులు లేవు. టీడీపీ నేతలే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. వైఎస్సార్ పార్టీ నాయకులే టీడీపీపై దాడులు చేస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా… నారా లోకేశ్ అబద్ధాలకు తెర తీశారు. వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ నేతలు చేసే దాడులు నారా లోకేశ్ కు కనిపించడం లేదా? అంటూ ఏపీ హోంమంత్రి సుచరిత లోకేశ్ కు కౌంటర్ ఇచ్చారు.
టీడీపీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులపై వైఎస్సార్సీపీ దాడులు చేస్తోందని.. తమ పార్టీ కేడర్ సహనాన్ని పరీక్షించొద్దని లోకేశ్ ఇటీవల ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే కదా. ఆ ట్వీట్లపై హోంమంత్రి సుచరిత స్పందించారు.
ఇటీవల జరిగిన గొడవల్లో టీడీపీ నేతలు 44 మంది గాయపడితే తమ పార్టీ నేతలు 57 మంది గాయపడ్డారు. టీడీపీనే రెచ్చగొట్టే ధోరణితో ఉంది. శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని సీఎం ఎప్పుడో చెప్పారు. అయినా కూడా టీడీపీ నాయకులు తమ ధోరణిని మార్చుకోవడం లేదు.
తమ పార్టీ ఎక్కడ ఉనికి కోల్పోతుందోనన్న భయంతో టీడీపీ దాడులకు తెగబడుతోంది. టీడీపీ తమ హయాంలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. టీడీపీనే తన ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులపై దాడికి తెగబడింది. ఇప్పుడు ఏం ఎరుగని నంగనాచిలా టీడీపీ నాయకులు వ్యవహరించడం సిగ్గు చేటు అని సుచరిత ఘాటుగా వ్యాఖ్యానించారు.