Teaser:అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ ను తలపిస్తున్న ఆన్ స్టాపబుల్ -2 ..!!

-

నటసింహ బాలకృష్ణ మొదటిసారిగా హోస్ట్ గా వ్యవహరించిన టాక్ షో అన్ స్టాపబుల్ విత్ NBK అనే షో. ఆహా లో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయ్యింది. ఈ టాక్ షో తో బాలయ్య అభిమానులు సరికొత్త కోణాన్ని చూశారు. ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్ -2 షో అందరిని బాగా ఆకట్టుకుంది.. తెలుగులో ఓటీటి లో అత్యంత వినోదపరితమైన సెలబ్రిటీ టాక్ షో గా పేరుపొందింది. ఇప్పుడు సీజన్ 2 కోసం అన్ని సిద్ధం చేశారు ఆహా సంస్థ. ఇప్పటికే ఈ షో కి సంబంధించి పలు పోస్టర్లు కూడా వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా విజయవాడలో అన్ స్టాపబుల్ – సీజన్ 2 ప్రీ రిలీజ్ గ్రాండ్ గా లాంచ్ చేయడం జరిగింది.

దసరా పండుగ సందర్భంగా ఆహా టీమ్ అన్ స్టాపబుల్ -2 ప్రోమోని విడుదల చేయగా.. టీజర్ లో బాలకృష్ణ సరికొత్త గా కనిపిస్తూ ఉన్నారు. ఈ టీజర్ చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఎంతో అద్భుతంగా ఉందని పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య ఏదో గుహలో వెతుకుతూ వెళుతూ ఉన్నట్లుగా ఈ టీజర్ లో చూపించడం జరిగింది. ఇక సీనియర్ హీరో గెటప్ మరియు సెటప్ అంతా కూడా ఒక అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ టీజర్ గా ఇది కొనసాగుతోంది.

బాలయ్య ఒక చేతిలో నిప్పు మరొక చేతిలో ఆయుధం పట్టుకొని ఏదో వెతుకుతూ ఉన్నట్లుగా టీజర్ ని చూపించడం జరిగింది. ఇక అందుకు సంబంధించి అన్ని విషయాలు పూర్తిగా తెలియాలి అంటే ట్రైలర్ రిలీజ్ అయ్యే వరకు ఉండాల్సిందే. అన్ స్టాపబుల్ -2 టీజర్ నీ జాంబిరెడ్డి ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ టీజర్ కాస్త వైరల్ గా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news