షూటింగ్‌ లు ఆపేది లేదు..ఆపితే ఊరుకోం – గిల్డ్ పై తెలంగాణ ఛాంబర్ సీరియస్‌

-

నిర్మాతల గిల్డ్ పై తెలంగాణ ఛాంబర్ సభ్యుల ఆగ్రహం వ్యక్తి చేసింది. చిత్రీకరణల బంద్ పై నిర్మాత ఆర్.కె.గౌడ్ వ్యతిరేకతను తెలిపారు. మా తెలంగాణా ఛాంబర్ లో 50 మంది వరకు నిర్మాతలున్నారు..చాలామంది వారి చిత్రీకరణలు చేస్తున్నారు.. ఆగస్ట్ 1 నుంచి చిత్రీకరణలు బంద్ చేస్తున్నట్లు గిల్డ్ నిర్మాతలు అంటున్నారని ఆగ్రహించారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్. అదంతా కూడా వారి స్వార్దం కోసం చేసెదేనని.. మేము మాత్రం చిత్రీకరణలు ఆపేది లేదని తేల్చి చెప్పారు.

చిత్ర పరిశ్రమ నలుగురిది కాదు.. అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలుండాలి..బంద్ అంటే వర్కర్స్ కు ఇబ్బంది అవుతుంది..వారి ఇష్టానుసారం కొందరు గిల్డ్ నిర్మాతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఓటిటి లకు వారి సినిమాలను ఎక్కువ రేట్లకు గిల్డ్ నిర్మాతలు అమ్ముకున్నారు..టికెట్ ధరలు పెంచమంది వారే.. ఇప్పుడు ధియేటర్ లకు ప్రేక్షకుల రావటం లేదని ఎడ్చేది వారేనన్నారు. ఆర్టిస్ట్ లకు రెమ్యూనిరేషన్ లు పెంచింది వారే..‌ఇంకొకరు ఎదగొద్దు అనేలా గిల్డ్ నిర్మాతలున్నారని తెలిపారు. టికెట్ రేట్లు తగ్గించాలి, పర్సంటేజ్ విధానం రావాలి.. మా చిత్రీకరణలు ఆపితే ఊరుకోమని హెచ్చరించారు తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ఆర్.కె.గౌడ్.‌

 

Read more RELATED
Recommended to you

Latest news