దేవి శ్రీ లవ్ స్టోరీ.. ఆ హీరోయిన్ తో పెళ్లికి రెడీ

-

మ్యూజిక్ డైరక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ప్రేమలో పడ్డాడా.. త్వరలోనే దేవి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఓ హీరోయిన్ ప్రేమలో పడ్డాడట. ఆమెతోనే ఈమధ్య ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇంతకీ దేవి శ్రీ ప్రసాద్ ప్రేమించే ఆ అమ్మాయి ఎవరు అంటే కన్నడ నటి పూజిత అని తెలుస్తుంది.

తెలుగులో రంగస్థలం సినిమాలో ప్రకాశ్ రాజ్ కూతురిగా నటించింది పూజిత. ఆ సినిమా టైంలోనే ఇద్దరు క్లోజ్ అయ్యారట. ఇప్పుడు పూజితతో డిఎస్పి పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని టాక్. త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అయితే ఈ వార్తలపై డిఎస్పి నుండి కాని పూజిత నుండి కాని ఎలాంటి క్లారిటీ రాలేదు.

తన మ్యూజిక్ తో అమ్మాయిల మనసులను దోచేస్తున్న డిఎస్పి లవ్ స్టోరీకి ఎలాంటి ముగింపు పడుతుందో చూడాలి. ప్రస్తుతం రాం చరణ్ వినయ విధేయ రామ, మహేష్ మహర్షి సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నాడు డిఎస్పి.

Read more RELATED
Recommended to you

Latest news