“ఆదిపురుష్” మూవీ టికెట్ రేట్ల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి

-

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రామాయణ గాధ ఆధారంగా రూపొందిన చిత్రం ఆదిపురుష్. మైథాలజికల్ కథాంశంతో రూపొందిన ఈ భారీ బడ్జెట్ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, జానకిగా కృతి సనన్ నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు బుకింగ్స్ ఓపెన్ కాలేదు.

రేపు మధ్యాహ్నం లోపు ఆదిపురుష్ బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆది పురుష్ మూవీ టికెట్ రేట్స్ తెలుగు రాష్ట్రాలలో పెరిగే అవకాశం ఉన్నట్లు వచ్చిన ఊహాగానాలకు తెరపడింది. ఏపీలో ఇప్పటికే 25 నుండి 50 రూపాయలు అదనంగా టికెట్ రేట్లు పెంచుకొని అమ్ముకుంటామని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడిగితే సూత్రప్రాయంగా ఓకే చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆదిపురుష్ టికెట్ ధరల పెంపుకి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

జీవో ప్రకారం 16వ తేదీ నుండి మూడు రోజులపాటు టికెట్ రేటు పెంచి అమ్ముకోవచ్చని జీవో కూడా రిలీజ్ చేసింది. మొదటి మూడు రోజుల సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఈ సినిమా టికెట్ పై రూ. 50 పెంచుకునేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా రోజుకు 6 షోలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇప్పటికే ఈ సినిమా టికెట్లను వేల సంఖ్యలో సెలబ్రిటీలు బుక్ చేసుకుని అనాధలకు చూపిస్తామని చెబుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news