గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం రూ.500 కోట్లు కేటాయించాలి – ఈటెల రాజేందర్

-

గల్ఫ్ బాధితుల సంక్షేమం కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హుజరాబాద్ బిజెపి ఎమ్మెల్యే, చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్. నేడు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గల్ఫ్ కార్మికుల సామాజిక భద్రత – ప్రభుత్వాల పాత్ర అంశంపై జరిగిన సదస్సుకు హాజరయ్యారు ఈటెల. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం కేరళ మోడల్ స్టడీ చేశామన్నారు.

కార్మికులు మరణిస్తే రూ. 25 లక్షలు పరిహారం వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి గల్ఫ్ కార్మికుల శవాలను దింపడానికే సరిపోతుంది కానీ.. వారి జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నాలు చేపట్టడం లేదన్నారు. రాబోయే కాలంలో ఈ సమస్యకి తప్పకుండా పరిష్కారం చూపిస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news