చెన్నైకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త శరవణన్ అరుల్..సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఒక్క తమిళ భాషలోనే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఆయన నటించిన చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేయబోతున్నారు.
న్యూ శరవణన్ స్టూడియోస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆయన ‘ ది లెజెండ్’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడమే కాకుండా అందులో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి జేడీ, జెయర్ ఇద్దరు దర్శకత్వం వహించగా, హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో శరవణన్ సైంటిస్ట్ గా కనిపించారు. కాగా, ఈ చిత్ర ఈవెంట్ సందర్భంగా శరవణన్ దిగిన ఫొటో ఒకటి ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. సదరు ఫొటోలో శరవణన్ పది మంది హీరోయిన్ల మధ్య నిలిచిన ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. పూజా హెగ్డే, తమన్నా, శ్రద్ధా శ్రీనాథ్, రాయ్ లక్ష్మి, హన్సిక…తో పాటు మొత్తంగా పది మంది హీరోయిన్స్ ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. వీరితో పాటు నటులు కూడా హాజరయ్యారు.
ఇక ఈ ఫొటోలు చూసి నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ‘అతిలోక సుందరుల నడుము సర్వాంగ సుందరంగా ముస్తాబైన ‘శర్వానందుడు’, ‘ ఆ ఎక్స్ ప్రెషన్ ఏంటి సామి’, ‘మహానుభావుడు, తారలందరినీ ఒకే తాటి మీద నిలబెట్టాడు’ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక హీరో శరవణన్ మాట్లాడుతూ తనపై విమర్శలు చేసే వారి గురించి తను ఆలోచించబోనని తెలిపారు. సిని మా ఫీల్డ్ లో తనకు రజనీకాంత్, విజయ్ రోల్ మోడల్స్ అని పేర్కొన్నారు. ‘ ది లెజెండ్’ ఫిల్మ్ డెఫినెట్ గా సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
'కారణజన్ముడు' అంటే ఎవరు స్వామీ??
ఇతగాడే నాయనా👇🏼👇🏼#TheLegend pic.twitter.com/7IoYVRaypQ
— 𝐊𝐢𝐬𝐡𝐨𝐫𝐞 (@Kishoredelights) May 31, 2022