థలపతి విజయ్” వారసుడు” ఫస్ట్ లుక్ రిలీజ్

-

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో థలపతి విజయ్ కథానాయకుడిగా దిల్ రాజు, శిరీష్, పీవీపీ బ్యానర్ పై పరమ్ వి పొట్లూరి, పెరల్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి “వారసుడు” అనే టైటిల్ ను ఖరారు చేశారు. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న చిత్రం కావడంతో వారసుడు అనే యాప్ట్ టైటిల్ ను ఖరారు చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు.

నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, శ్యామ్, యోగిబాబు, సంగీత, సంయుక్త ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చెన్నైలో సినిమా కోర్ టీమ్ పై కీలకమైన భారీ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్, పళని ఛాయాగ్రహకుడు గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news