ఓటీటీలో థాంక్యూ మూవీ..రిలీజ్ డేట్ ఫిక్స్

నాగచైతన్య.. ప్రస్తుతం బంగార్రాజు , లవ్ స్టోరీ వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలను తన ఖాతా లో వేసుకుని.. వరుస విజయాలతో దూకుడు మీద ఉండగా థాంక్యూ సినిమాతో బ్రేకులు పడిందని చెప్పవచ్చు. దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో నాగచైతన్య హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన థాంక్యూ సినిమా కనీసం ఓపెనింగ్స్ కూడా దక్కించుకోలేకపోవడం గమనార్హం.

ఇక లేటెస్ట్ ఫీల్ గుడ్ మూవీ థాంక్యూ టీజర్స్, ట్రైలర్ అన్ని కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ క్రమంలోనే జూలై 22వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాపై మంచి అంచనాలు కూడా ఏర్పడ్డాయి.

కానీ సినిమా విడుదలైన మొదటి ఆట నుంచి డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకోవడం గమనార్హం. ఇక ఈ సినిమాలో ముఖ్యపాత్రలో మాళవికా నాయర్, అవికా గోర్ నటించగా, సంగీతం థమన్ అందించారు. ఈ సినిమాకు సంబంధించి ఓటిటి డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్‌ వాళ్లు కొనుగోలు చేసారు. ఇక ఈ క్రమంలోని ఆగస్టు 11వ తేదీ నుంచి అమెజాన్ లో ప్రసారం కానున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక పోస్టర్‌ ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం.