RRR : నాటు నాటు పాట‌కు థీయేట‌ర్లో తాత స్టెప్పులు.. వీడియో షేర్ చేసిన లావ‌ణ్య త్రిపాఠి

టాలీవుడ్ గ్రేట్ డైరెక్ట‌ర్ జ‌క్క‌న్న చెక్కిన అద్భ‌త‌మైన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా ప్ర‌స్తుతం ప్రపంచాన్నే ఏలేస్తుంది. ఈ సినిమాలో ప్ర‌తి సీన్ కూడా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. సీన్ లు మాత్ర‌మే కాదు.. పాట‌లు అయితే ప్రేక్షకుల‌ను ఉర్రూత‌లూగిస్తుంది. ముఖ్యంగా నాటు నాటు అనే పాటకు అయితే… చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. థీయేట‌ర్లు, బ‌య‌ట ఎక్క‌డ చూసిన నాటు నాటు.. అంటూ కాళ్లు క‌దుపుతూనే ఉన్నారు.

పిల్లలు, యువ‌కులు, ముసలి వాళ్లు అనే తేడా.. నాటు నాటు సాంగ్ కు లేదు. పాట వినిపించిందా.. వ‌య‌సు మ‌ర్చిపోవాల్సిందే.. కాళ్లు క‌ద‌పాల్సిందే. అందుకు వ‌య‌సుతో సంబంధం లేదు. పిల్ల‌లు అయినా.. ముస‌లి తాత అయినా స్టెప్పు ప‌డాల్సిందే. అంతగా ఆక‌ట్టుకుంటున్న ఈ పాటకు థీయేట‌ర్ లో ఒక ముస‌లి తాత వేసిన స్టేప్పుల వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. థీయేట‌ర్లో ఉన్న మెట్లు ఎక్కుతూ.. నాటు నాటు పాట‌కు అనుగూణంగా స్టెప్పులు వేస్తూ వేస్తున్న తాత ను చూసి థీయేట‌ర్ మొత్తం ఈల‌లు, గోల‌లే. కాగ ఈ వీడియో ను టాలీవుడ్ హీరోయిన్.. లావ‌ణ్య త్రిపాఠి కూడా త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేసింది.