తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇకపోతే పూరీ మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ లకు కొంతకాలం దూరంగా ఉన్న పూరీ జగన్నాథ్ మళ్లీ ప్రారంభించాడు. ఇప్పటికే ఎన్నో విభిన్నమైన కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు వినిపించిన ఆయన ఈసారి తడ్కా గురించి తెలిపాడు. తడ్కా అంటే తాలింపు కాబట్టి వంటల సబ్జెక్టు ఎంపిక చేసుకున్నారంటే పొరపాటే.. కానీ పూరీ చెప్పిన ఆ తాలింపు వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. పూరీ మాట్లాడుతూ..” మనం అప్పుడప్పుడు ఏదైనా పని కోసం ఒక మనిషిని.. మరో మనిషి దగ్గరకు పంపిస్తాం.. అవతల వ్యక్తి ఏమన్నాడు ..అనేది తప్ప మిగిలినవన్నీ చెబుతాడు మనం వెళ్ళమని చెప్పిన వ్యక్తి..
ఏమైంది అని అడిగితే..?మంచి రోజులు కావు .. నువ్వు ఎంత మంచి చేసినా ఫలితం ఉండదు.. అతడు అలా మాట్లాడాడు.. నాకు నచ్చలేదు.. డబ్బు ఎక్కువ అవ్వడం వల్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. నేను కాబట్టి ఊరుకున్న..వాడి మాటలు వింటే నువ్వు కొడతావు అని.. పంపించిన మనిషి సమాధానం ఇస్తాడు.. ఇదంతా కాదు ఆయన ఏమన్నాడో చెప్పు అని ఒకవేళ గట్టిగా అడిగితే ..డబ్బులు ఇచ్చి పట్టుకెళ్ళమన్నాడు అని బదిలిస్తాడు.. అక్కడ పెనంలో ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకొచ్చే లోపు మనుషులు తాలింపు వేసి తీసుకొస్తారు.. తాలింపు అంటే తడ్కా.. జీవితంలో సగం గొడవలు ఈ విధంగానే జరిగాయి..
ముఖ్యంగా మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా? లేక వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా? అనేదాన్ని మనం గ్రహించాలి ..లేకపోతే ఇలా నష్టపోవాల్సి వస్తుంది నా జీవితంలో ఇలా మధ్యవర్తులను నమ్మి నేను చాలా మోసపోయాను..ఇదే ఎన్నో గొడవలకు కారణం అయ్యింది అంటూ తెలిపారు. ఇకనైనా మధ్యవర్తులు చెప్పే మాటలను నమ్మకండి.. ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడానికి మీకంటూ కొంచెం సమయం ఏర్పాటు చేసుకోండి అంటూ అంటూ పూరీ జగన్నాథ్ తెలిపారు.