సైరా: చిరు న‌ట విశ్వ‌రూపం

-

మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమా సైరా. కర్నూలు జిల్లాకు చెందిన తొలి తెలుగు స్వాతంత్య్ర‌ సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాన్ని తెరపై ఆవిష్కృతం చేసేందుకు చిరంజీవి ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా అహర్నిశలూ కష్టపడ్డారు. ఈ సినిమా కోసం చిరు ఏకంగా రెండు సంవత్సరాల పాటు కేటాయించడం అంటే మామూలు విషయం కాదు. 60 సంవత్సరాల వయసులో ప్రాణం పెట్టి ఈ సినిమా కోసం తన కెరీర్‌లోనే బెస్ట్‌ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సినిమా చూస్తుంటే ఆద్యంతం తన భుజస్కందాలపై నడిపించాడు. ఇంకా చెప్పాలంటే సురేందర్ రెడ్డి టేకింగ్ డామినేట్ చేసి మరి చిరంజీవి నటన ఉందని చెప్పాలి.

సైరా కోసం చిరు తనయుడు రామ్ చరణ్ 280 కోట్లు ఖర్చు చేయడంతో పాటు… తండ్రికి అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చేందుకు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని మరి తనవంతుగా కష్టపడ్డాడు. అటు డైలాగులు చెప్పే తీరులో గాని.. యాక్ష‌న్ సీక్వెల్స్‌గాని చిరు అమేజింగ్ పెర్పామెన్స్ ఇచ్చారు. తెలుగు జాతి గ‌ర్వించ‌ద‌గ్గ ఓ యోధుడు క్యారెక్ట‌ర్లో చిరు తొలిసారిగా న‌టించ‌డంతో… ఈ పాత్ర‌కు చిరును త‌ప్ప ఇంకెవ‌రిని ఊహించుకోలేం అన్నంత గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చిరు ఇచ్చారు.

ఇక సినిమాను దర్శకుడు సురేందర్ రెడ్డి నిర్మించారు.. అతి భారీ ప్రాజెక్టును తన భుజాలపై వేసుకున్న దర్శకుడు ప్రేక్షకులను ఏ యాంగిల్ లో అలరించాలి అనేది మాత్రం తెలుసుకోలేక పోయాడు . ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ చ‌రిత్ర‌లోనే ఓ గొప్ప యోధుడి పాత్ర‌ను ఈ వ‌య‌స్సులో పోషించ‌డం బ‌హుశా చిరంజీవికే చెల్లింద‌ని చెప్పాలి. సినిమా క‌మ‌ర్షియ‌ల్ జ‌యాప‌జ‌యాలు ఎలా ? ఉన్నా ఇంత గొప్ప పాత్ర‌లో చిరు చేయ‌డం ద్వారానే సైరా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌స్సులు గెలుచుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news