సినిమాను వెంటాడుతున్న ప్రమాదాలు…!

-

సినిమా అనగానే మనకొక వినోదం… లేదా వాళ్ళు సంపాదించే కోట్ల కొద్దీ డబ్బులు. ఇవే మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదిస్తారు అనే పేరు మాత్రమే గాని వాళ్ళ ప్రాణాలు అనేవి చాలా రిస్క్ లో ఉంటాయి. నీళ్ళల్లో చేసే విన్యాసాలు, చెట్ల మీద, భవనాల మీద, అగ్ని విన్యాసాలు ఇలా చాలా ఉంటాయి. అవసరమైతే క్రూర మృగాలతో కూడా పోరాడాల్సి ఉంటుంది.

దీనితో కొన్ని కొన్ని ప్రమాదాలు ఇప్పుడు సినీ పరిశ్రమను భయపెడుతున్నాయి. తాజాగా భారతీయుడు 2 సినిమాలో జరిగిన ప్రమాదం ఆందోళనకు గురి చేస్తుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. శంకర్ పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. అసలు ఇప్పటి వరకు సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదాలు ప్రధానంగా చూస్తే, బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇవి వెంటాడాయి.

2009లో రామ్ చరణ్ ‘మగధీర’ షూటింగ్‌ సమయంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్‌ హెయిన్స్‌, బైక్‌ తో పాటు గాల్లోకి ఎగిరే ఒక సన్నివేశంలో తాడు ఊడిపోవడంతో దాదాపు 40 అడుగుల ఎత్తు నుంచి కింద పడగా ఆయన శరీరంలోని 19 ఎముకలు విరిగిపోయాయి.

ప్రముఖ రచయిత గొల్లపూడి మారుతీ రావు తనయుడు శ్రీనివాస్ ప్రేమ పుస్తకం సినిమా షూటింగ్ సందర్భంగా సముద్ర అలల తాకిడికి చనిపోయారు. ఆ తర్వాత ఆ సినిమాను గొల్లపూడి మారుతీ రావు పూర్తి చేసారు.

1980లో మలయాళం సినిమా కొలిలక్కమ్‌ సినిమా చిత్రీకరణలో హెలికాప్టర్‌ ప్రమాదంలో జయన్‌ అనే స్టార్‌ నటుడు ప్రాణాలు కోల్పోయారు. 1982లో అమితాబ్‌ బచ్చన్‌ ‘కూలీ’ షూటింగ్‌ సమయంలో, ఫైట్‌లో భాగంగా బిగ్‌బీ ఒక టేబుల్‌పై దూకే సీన్‌ అది. అలా దూకే క్రమంలో టేబుల్‌ అంచున ఉండే పదునైన భాగం అమితాబ్‌ కి తగలడంతో దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చారు.

2016లో బెంగళూరు జాతీయ రహదారిపై ‘మాస్తిగుడి’ అని అనే సినిమా షూటింగ్ లో ఫైట్‌ సన్నివేశంలో హీరో విజయ్‌ మరో ఇద్దరు నటులు నీళ్ళల్లో దూకే క్రమంలో ఇద్దరు నటులు అనిల్‌, ఉదయ్‌ ప్రాణాలు కోల్పోయారు.

ఇలా చెప్పుకుంటూ పోతే వందల కొద్దీ ప్రమాదాలు ఉన్నాయి. బాలీవుడ్ లో జాన్ అబ్రహం, హ్రితిక్ రోషన్, హాలీవుడ్ లో జాకీ చాన్ సహా ఎందరో ప్రమాదాలకు గురయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news