SP బాలుకు వినూత్నంగా నివాళి తెలిపిన మహా శిల్పి.!

-

ప్రముఖ మహా సైకత శిల్పి అయినటువంటి సుదర్శన్‌ పట్నాయక్‌ ప్రఖ్యాత సినీ నేపధ్య గాయకుడు, పద్మశ్రీ SP బాలసుబ్రహ్మణ్యానికి చాలా వినూత్నంగా తన కళతో నివాళులు అర్పించారు. ఒడిశా రాష్ట్రంలోని విశాలమైన పూరి సముద్ర తీరంలో బాలు చిత్రాన్ని ఇసుకపైన చిత్రీకరించి అంజలి ఘటించారు. దాన్ని చూసిన స్థానికులు బాలుగారికి ఇది సరియైన నివాళి అని సుదర్శన్ గారిని అభినందించారు.

కాగా, గత నెల 5వ తేదీన కరోనా బారిపడిన బాలసుబ్రహ్మణ్యం గారు తమిళనాడులో చికిత్స పొందుతూ, కోలుకున్నట్లే కోలుకొని పరిస్థితి విషమించి నిన్న శుక్రవారంనాడు మరణించిన సంగతి తెలిసినదే. గగనానికేగిన గాన గంధర్వునికి దేశ ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయకుడుతోపాటు దేశ వ్యాప్తంగా వున్న రాజకీయ, సినీ ప్రముఖులు ఎందరో నివాళులు అర్పించారు. కాగా, 2001లో ఆయనను పద్మశ్రీ, 2011లో పద్మ విభూషణ్‌ అవార్డులు వరించిన సంగతి అందరికీ తెలిసినదే.

Read more RELATED
Recommended to you

Latest news