థియేటర్​లో టికెట్లు అమ్ముకుంటున్న హీరోయిన్​.. ఏమైందో ఏమో!

-

పెళ్లిసందD సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది బెంగళూరు భామ శ్రీలీల. ఈ సినిమా ఆశించిన స్థాయిలో బ్రేక్‌ ఇవ్వలేకపోయినా.. యాక్టింగ్‌ పరంగా శ్రీలీలకు మంచి మార్కులే పడ్డాయి. ఈ బ్యూటీ ప్రస్తుతం బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. శ్రీలీల నటిస్తోన్న తెలుగు చిత్రాల్లో ఒకటి ధమాకా.

త్రినాథరావు నక్కిన డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో రవితేజ హీరోగా నటిస్తున్నాడు. ఈ మాస్‌ ఎంటర్‌టైనర్‌ డిసెంబర్ 23న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టింది టీం. ఇందులో భాగంగా తమ సినిమాను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడానికి రకరకాల ప్రమోషన్స్ చేస్తోంది మూవీటీమ్​​.

ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్​ కోసం.. హీరోయిన్ శ్రీలీల చేసిన ఓ పని వైరల్​ అవుతోంది. ఆమె హైదరాబాద్​లోని ఏఎంబీ మాల్​లో కాసేపు సందడి చేసింది. అక్కడికి వచ్చిన యూత్​తో కలిసి సరదాగా డ్యాన్స్ కూడా చేసింది. ఇక ధమాకా అడ్వాన్స్ బుకింగ్ టికెట్స్ కూడా అమ్మింది. ఏకంగా హీరోయిన్ టికెట్స్ అమ్ముతుండేసరికి.. ఫ్యాన్స్ కౌంటర్​కు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరితో మాట్లాడిన శ్రీలీల.. ధమాకాలో మీ ఫేవరెట్ సాంగ్ ఏది? ఆ స్టెప్ వేయండి ఓసారి అంటూ టికెట్స్ అమ్మింది.

ఇక ఈ చిత్రంలో చిరాగ్‌ జానీ విలన్‌గా నటిస్తున్నాడు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ ధమాకా చిత్రాన్ని సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. శ్రీలీల దీంతోపాటు తెలుగులో అనగనగా ఒక రోజు, కన్నడ-తెలుగు బై లింగ్యువల్ ప్రాజెక్ట్‌ జూనియర్‌ సినిమాల్లో నటిస్తోంది. రవితేజ మరోవైపు సుధీర్‌ వర్మ దర్శకత్వంలో రావణాసుర, పాన్‌ ఇండియా చిత్రం టైగర్‌ నాగేశ్వర్‌రావు సినిమాలు లైన్‌లో పెట్టాడు. వాల్తేరు వీరయ్య చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news