రెండేళ్ల బాలుడిని అమాంతం మింగేసిన హిపోపాటమస్..

-

సోషల్‌ మీడియా వల్ల ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతుంది. వైరల్ అవడానికి రోజులు చాలు. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ వీడియోలో చాలా ఉంటాయి. అదృష్టం ఉంటే ట్రైన్‌ కింద పడినా ప్రాణాలతో బయటపడొచ్చు.. అదే దురదృష్టం వెంటాడుతుంటే.. సైకిల్‌ కిందపడినా ప్రాణాలమీదకు వస్తుంది. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ ఘటనలో రెండేళ్ల బాలుడిని నీటి గుర్రం మింగేసింది.. ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టేనేమో.. ప్రాణాలతో భయటపడ్డాడు.. ఇంతకీ ఇది ఎక్కడ జరిగిందంటే..

ఇదీ జరిగింది

ఉగాండాలో ఓ సరస్సుకు సమీపంలో రెండేళ్ల చిన్నారి ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో వాడి తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. అయితే సరస్సు నుంచి వచ్చిన నీటి గుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికి పైగా శరీరం నోట్లోకి వెళ్లింది. అయితే అదే సమయంలో అటువైపు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఇది గమనించి గట్టిగా అరిచాడు. ఆ నీటి గుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది భయపడి బాలుడ్ని వదిలేసింది. కానీ హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స చేశారు.. అయితే చిన్నారికి ఎలాంటి అపాయం లేదని వైద్యులు తెలిపారు.

నీటిగుర్రాలు శాఖహారులే.. అయినా కూడా బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి తెలుసా..?. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి.. దీని దంతాలు చాలా బలంగా ఉంటాయి. ఇది ఒక్కటే కాదు.. భయపడినప్పుడు ఏ జంతువులైనా మనపైన దాడికి దిగుతాయి. వాటిని ఎక్కడ ఏం చేస్తామో అన్న భయంతో అవి మనకు హాని కలిగిస్తాయి. ఏదిఏమైనా.. బాబు ప్రాణాలతో భయటపడ్డాడు. మీరు కూడా చిన్నపిల్లలతో బీచ్‌లకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. సడన్‌గా పాములు కూడా రావొచ్చు.. ఉత్సాహంతో మరీ లోతుగా వెళ్తే కష్టమే..! ఇప్పటికే ఇలాంటి ఘటనలు బోలెడు..!

Read more RELATED
Recommended to you

Latest news