ఈ సీరియల్ నటి భర్త కూడా మనకు తెలిసిన నటుడే..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన ఛత్రపతి సినిమాలో భద్రం పాత్రతో ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందారు. ఇక బాహుబలి సినిమాలో తప్పించి రాజమౌళి దర్శకత్వం వహించిన అన్ని సినిమాలలో కూడా చంద్రశేఖర్ నటించడం జరిగింది.. అంతేకాదు ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కూడా చంద్రశేఖర్ నటించి మెప్పించారు. సీరియల్స్ ద్వారా మొదట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న చంద్రశేఖర్.. రాజమౌళి దర్శకత్వం వహించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి తన సినిమాలలో ఎక్కువగా చంద్రశేఖర్ ఉండే విధంగా చూసుకుంటారు. కానీ బాహుబలిలో ఎందుకు లేడు అనే అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి..

నిజానికి బాహుబలి సినిమాలో కూడా చంద్రశేఖర్ పాత్ర ఉందట. కానీ ఆ పాత్ర సినిమాకి అడ్డంకిగా ఉండడంతో పాటు చంద్రశేఖర్ కి కూడా నచ్చకపోవడంతో బాహుబలి నుంచి తప్పుకున్నారని సమాచారం. ఇకపోతే ఈయన భార్య గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈయన భార్య పేరు నిలియా భవాని. ఈమె గురించి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పవచ్చు. అయితే ఈమె కూడా పండగ చేస్కో, కిక్ 2, సైరా నరసింహారెడ్డి, నాని జెంటిల్మెన్ వంటి చిత్రాలలో కూడా నటించింది. ఇక అంతే కాదు సీరియల్స్ ద్వారా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె మరికొన్ని సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం. ఇక చంద్రశేఖర్ కూడా రాజమౌళి దర్శకత్వం వహించే సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉంటాడని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో చంద్రశేఖర్ నటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.