న్యూ లుక్ లో తళుక్కుమన్న ఐకానిక్ స్టార్..!

-

సుకుమార్ డైరెక్షన్లో ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తెరకెక్కించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ న్యూ లుక్ లో ముంబై ఎయిర్పోర్ట్ లో తాజాగా దర్శనమిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట చాలా వైరల్ గా మారుతున్నాయి. అయితే అల్లు అర్జున్ ఈ న్యూ లుక్ లో పుష్ప 2 సినిమా కోసమే కనిపిస్తున్నారు అంటూ అభిమానులు తెగ కామెంట్లు చేస్తున్నారు..

ఇందులో లాంగ్ హెయిర్ స్టైల్, స్టైలిష్ స్పెక్స్, సింపుల్ కాస్ట్యూమ్ లో మెరిసిన బన్నీ లుక్కు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. మొత్తానికి అయితే ఈ స్మార్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఐకానిక్ స్టార్ అనిపించుకున్నారు అంటూ ఆయన అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ విషయానికి వస్తే.. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈయన గతంలో ఎన్నో చిత్రాలలో నటించి భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు. కానీ పుష్ప సినిమాతోనే పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ లభించిందని చెప్పాలి.

వాస్తవానికి ఈయన బాలీవుడ్ లో పెద్దగా ప్రమోషన్ చేయకపోయినా సరే తన స్టార్డంతో బాలీవుడ్ లో కూడా పాపులారిటీ దక్కించుకొని పుష్ప సినిమాతో రూ.100 కోట్ల మార్క్ రీచ్ అయ్యాడు అంటే ఇక ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సౌత్ ఇండియా మాత్రమే కాదు నార్త్ ఇండియా కూడా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా కోసం తెగ ఆత్రుత గా ఎదురుచూస్తున్నారు. మరి సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా అల్లు అర్జున్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. ఇక ఇందులో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news