పవన్ ను టార్గెట్ చేసిన పెయిడ్ మీడియా.. రాజకీయమేనా.?

-

సాధారణంగా ఎక్కడైనా సరే మీడియా కవరేజ్ అనేది రాజకీయాలలో అధికార పార్టీకే అనుకూలంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా అనేక ఆర్థిక రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నందువల్ల సహజంగానే మీడియా నుంచి అధికార పార్టీకి కొంత మద్దతు లభిస్తూ ఉంటుంది. ఇకపోతే కొంతకాలంగా ఎవరికి మీడియా ఒమ్ము కాయదు అంటూ చెప్పుకొచ్చిన మీడియా సంస్థలు కొన్ని రోజులపాటు జనసేన పార్టీకి పాజిటివ్గా వార్తలను ప్రచారం చేసేవి కానీ ఏమైందో తెలియదు కానీ రెండు నెలలుగా ఈ పరిస్థితుల్లో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది.

ఎందుకంటే దాదాపు 90 శాతం యూట్యూబ్ ఛానల్ అలాగే న్యూస్ యాప్ లు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాయి. అయితే ఇలా ఉన్నట్టుండి పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా మారడం వెనుక అధికార వైసిపి పార్టీ హస్తం ఉందని కొన్ని వందల యూట్యూబ్ ఛానల్లను ప్రస్తుతం స్వింగ్లో ఉన్న అనేక న్యూస్ యాప్లను అధికార పార్టీ తనవైపుకు తిప్పుకుందని ముఖ్యంగా భారీగా డబ్బు ఆశ చూపించి తమకు అనుకూలంగా.. ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా వార్తలు రాసే విధంగా ప్రోత్సహిస్తున్నారని జనసైనికులు కూడా ఆరోపిస్తున్నారు.

ఇకపోతే నిన్న మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గురించి అనుకూలంగా వార్తలు రాసిన మీడియా ఛానల్స్ ఇప్పుడు ఉన్నట్టుండి ఫేక్ వార్తలు ప్రచారం చేస్తుండడంతో అభిమానుల సైతం మండిపడుతున్నారు. ఇది యాదృచ్ఛికంగా జరుగుతున్న సంఘటనలు కాదు అని అధికార పార్టీ ఉద్దేశపూర్వకంగానే తమ ఆర్థిక బలంతో ఈ న్యూస్ ఛానల్ ను తమ వైపు తిప్పుకుందని ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాల్సిన మీడియా ఇలా ఆర్థిక ప్రయోజనాలకు అనుకూలంగా వార్తలు రాయడం ఏం సభ్యంగా లేదు అని మండిపడుతున్నారు. మొత్తానికి అయితే జనసేనను అడ్డుకోవడానికి ఎన్ని పెయిడ్ ఏజెంట్లు వచ్చిన నిలబడలేవని దీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news