ఫ్లాట్‌ ఫామ్‌పై నిద్రిస్తున్న ప్రయాణికులపై నీళ్లు పోసిన పోలీస్‌.. వీడియో వైరల్‌

-

బస్టాండ్‌లో, రైల్వే స్టేషన్‌లో రాత్రుళ్లు కొంతమంది ప్రయాణికులు నిద్రపోతుంటారు. కొన్ని పరిస్థితులు వస్తాయి.. మనం కూడా చేసేదేం లేక అలా ఫ్లాట్‌ ఫామ్‌పైనే కునుకుతీస్తాం. కానీ అలా ఫ్లాట్‌ ఫ్లామ్‌పై పడుకున్న వారిపై ఓ పోలీస్‌ నీళ్లు పోశాడు. అసలైతే వాళ్లను లేపి ఇక్కడ పడుకోకూడదు అని చెప్పాలి. కానీ అసలు ఏం మాట్లాడకుండా వాళ్లను కనీసం మనుషుల్లెక్క ట్రీట్‌ చేయకుండా ఆ పోలీస్‌ అలా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

పుణె రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌పై నిద్రిస్తున్న వాళ్లపై ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో నీళ్లు పోసిన వీడియో వైరల్ అవుతోంది. ట్విటర్‌లో ఓ యూజర్ దీన్ని షేర్ చేశాడు. గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP)కి చెందిన ఓ పోలీస్ వాటర్ బాటిల్‌తో అందరి ముఖంపై నీళ్లు కొట్టాడు. దీనిపై నెటిజన్లు తెగ మండి పడ్డారు. “మానవత్వమే లేదా..” అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో పుణె డివిజనల్ రైల్వే మేనజర్ వరకూ వెళ్లింది. ఇది చూసిన వెంటనే ఆయన అసహనానికి లోనయ్యారు. ఇలా జరగడం పట్ల ఆమె క్షమాపణలు చెప్పారు.


ప్లాట్‌ఫామ్‌పై అలా పడుకోవడం వల్ల మిగతా ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. అయినా సరే వాళ్లతో వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు. మిస్‌ హ్యాండిల్ చేశారు. అనుచితంగా ప్రవర్తించిన ఆ పోలీస్‌ని మందలించాం. ప్యాసింజర్స్‌తో మర్యాదగా నడుచుకోవాలని చెప్పాం. ఇలా జరగడం చాలా బాధాకరం అని పుణె డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ ఇందూ దూబే తెలిపారు.

ఇప్పటికే ఈ వీడియోకి 4.4M వ్యూస్‌ వచ్చాయి. ..16 వేల లైక్స్ వచ్చాయి. కామెంట్స్ సెక్షన్‌ అయితే మారుమోగి పోతోంది. కొంత మంది ఈ వీడియోని రీట్వీట్ చేస్తూ ఉన్నతాధికారులనూ ట్యాగ్ చేశారు.

వాస్తవానికి రైల్వే స్టేషన్స్‌లో వెయిటింగ్‌ రూమ్స్‌ ఉండాలి. అవి కూడా సామాన్యులకు అందుబాటులో ఉండే రేంజ్‌లో ఉండాలి. పెద్ద పెద్ద రైల్వేస్టేషన్లలో వెయిటింగ్‌ రూమ్స్‌ కొరత ఎక్కవగా ఉంది. వెయిటింగ్‌ హాల్స్‌కూడా ఇలానే ఉన్నాయి. దీనివల్లే ఇలా జరుగుతుందని నెటిజన్లు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news