జన్మనిచ్చిన తల్లి చిత్రాన్ని అద్భుతంగా గీసిన హాస్యబ్రహ్మ.. ఫోటో వైరల్..!

-

హాస్యబ్రహ్మ: టాలీవుడ్ స్టార్ కమెడియన్ హాస్యనటుడు బ్రహ్మానందం తన తల్లిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. అమ్మ ప్రేమకు సృష్టిలో ఉన్న ఎవరైనా ఇట్టే కరిగిపోవాల్సిందే. అందుకు సెలబ్రిటీలు సైతం మినహాయింపు ఏమీ కాదు కదా.. అలా మదర్స్ డే సందర్భంగా తన తల్లి చిత్రాన్ని అద్భుతంగా గీశారు బ్రహ్మానందం..

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ఇప్పటికే చిత్రలేఖనం పైన తనకున్న ఆసక్తిని చూపిస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్లో వందల సినిమాల్లో నటించిన ఈయన ఇప్పటివరకు సినిమాలతోనే బిజీగా గడిపేశారు. కాగా గత కొన్నాళ్ల నుంచి సినిమాలుకు కాస్త బ్రేక్ ఇచ్చి పూర్తి సమయాన్ని కుటుంబానికి తనకి ఇష్టమైన చిత్రలేఖనానికి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెంకటేశ్వర స్వామి చిత్రాన్ని సైతం అద్భుతంగా గీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తనకు జన్మనిచ్చిన మాతృమూర్తి చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని బ్రహ్మానందం తనయుడు గౌతమ్ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా ప్రస్తుతం వైరల్ గా మారింది.

సినిమాల విషయానికి వస్తే కెరియర్లో ఎన్నో సినిమాల్లో నటించిన బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూనే వస్తున్నారు. తాజాగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన రంగమార్తాండ సినిమాలో కనిపించారు. ఇందులో తనకు పూర్తి విభిన్నమైన పాత్ర చేస్తూ ఎందరో ప్రశంసలు గెలుచుకున్నారు. ఈ సినిమాలో బ్రహ్మానందం నటనకు చిరంజీవి సైతం ఫిదా అయిపోయి అతని ఇంటికి వెళ్లి విష్ చేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news