ఆకలిగా ఉన్నప్పడు తినకపోతే అసలు ఏం జరుగుతుందో తెలుసా..?

-

ఆకలిగా: ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి తినాలి.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరక.. చాలా మంది ఆకలితోనే ఉంటాయి.. అసలు ఆకలిగా ఉన్నప్పుడు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా..? మీరు అనుకుంటారు.. కేవలం గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది.. కొంచెం సేపటికి ఇక ఏదీ తినాలనిపించదు అని.. ఇంతకుమించి జరుగుతుంది. ఆకలిగా ఉన్నప్పడు తినకుండా ఉంటే బ్రెయిన్‌ ఎంత ఆగం అవుతుందో ఈరోజు తెలుసుకోండి..!

 

వేళ‌కు భోజనం చేయ‌క‌పోయినా, బాగా ఆక‌లిగా ఉన్న‌ప్పుడు చాలా సేపు ఆగి భోజ‌నం చేసినా.. అనేక స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ముఖ్యంగా ఆరోగ్య‌వంతుల్లో అయితే షుగ‌ర్ లెవ‌ల్స్ ప‌డిపోతాయి. దీంతో ఏకాగ్ర‌తను కోల్పోతారు. నేరుగా ఆలోచించ‌లేరు. జ్ఞాప‌క‌శ‌క్తి త‌గ్గుతుంది. మెదడు యాక్టివ్‌గా ప‌నిచేయ‌దు. మెద‌డు ఎక్కువ‌గా గ్లూకోజ్ మీద ఆధార ప‌డుతుంది. శ‌రీరంలో త‌గిన‌తం గ్లూకోజ్ లేక‌పోతే మెద‌డు సిగ్న‌ల్స్ ఇస్తుంది. దీంతో ప‌ని మీద ధ్యాస ఉండ‌దు. దేనిపై కూడా ఏకాగ్ర‌త పెట్ట‌లేరు. స‌రిగ్గా ఆలోచించ‌లేరు. ఆలోచ‌న‌ల‌పై ప్ర‌భావం చూపిస్తుంది. ఆలోచ‌నాశ‌క్తి స‌న్న‌గిల్లుతుంది. అందుకే ఆకలిగా ఉన్నప్పుడు..మీరు ఏ పని చేయలేరు.. ఒకవేళ చేసినా..అది అంత ఎఫెక్టివ్‌గా ఉండదు.

ఆక‌లిగా ఉన్న‌ప్పుడు లేదా వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే శ‌రీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసోల్ పెరుగుతుంది. దీంతో త‌రువాత ఎప్పుడు భోజ‌నం చేసినా మ‌న‌కు తెలియ‌కుండానే ఎక్కువ‌గా ఆహారం తింటాం. ఇలా రోజూ చేస్తే అధికంగా బ‌రువు పెరిగేందుకు అవకాశం ఉంటుంది. వేళ‌కు భోజనం చేస్తే బ‌రువు పెర‌గ‌కుండా చూసుకోవ‌చ్చు. బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉంటుంది. వేళ‌కు భోజ‌నం చేయ‌క‌పోతే శ‌రీర మెట‌బాలిజం త‌గ్గుతుంది. దీని వ‌ల్ల క్యాల‌రీలు త్వ‌ర‌గా ఖ‌ర్చు కావు. శరీరంలో కొవ్వు నిల్వ‌లు పేరుకుపోతాయి. అధిక బ‌రువు త‌గ్గ‌డం క‌ష్ట‌మ‌వుతుంది. బ‌రువు పెరుగుతారు.

వేళ‌కు భోజ‌నం చేయ‌ని వారు జంక్ ఫుడ్‌, నూనె ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తింటార‌ని సైంటిస్టులు అంటున్నారు. ఆక‌లిగా ఉంటే వెంట‌నే భోజనం చేయాలి. భోజ‌నం చేయ‌లేక‌పోతే పండ్లు లేదా న‌ట్స్ వంటివి అయినా తీసుకోవాలి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. బ‌రువు త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. శ‌రీరంలో శ‌క్తి స్థాయిలు త‌గ్గ‌కుండా చూసుకోవ‌చ్చు. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. అందుకే అనేది వేళకు భోజనం చేయమని..!!

Read more RELATED
Recommended to you

Latest news