ఎన్టీఆర్ నటించిన ఆ మూవీ మధ్యలోనే ఆగిపోవడానికి కారణం..?

-

తెలుగు తెరపై బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇకపోతే ఈ సినిమా కమర్షియల్ గా బాగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఆడియన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ ఏంటో తెలిసేలా చేసింది ఈ సినిమా. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లాంటి రికార్డులు సృష్టించిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్లో ఫెయిల్యూర్స్ ఉన్నప్పటికీ తన కెరియర్ లో మాత్రం ఫెయిల్ అయిన సందర్భాలు లేవనే చెప్పాలి. బరువు తగ్గిన తర్వాత కూడా ఎన్టీఆర్ ను అభిమానించే అభిమానుల సంఖ్య బాగా పెరిగింది అని చెప్పవచ్చు.

ఇకపోతే ఎన్టీఆర్ కెరియర్లో కొంత కాలం షూటింగ్ జరుపుకొని మరి ఆగిపోయిన సినిమా లేదని చాలామంది అభిమానులు భావిస్తారు.. కానీ సింహాద్రి సినిమాకి ముందు జూనియర్ ఎన్టీఆర్ పవన్స్ శ్రీధర్ అనే వ్యక్తి డైరెక్షన్ లో ఒక సినిమాకు ఓకే చెప్పి షూటింగ్లో పాల్గొనడం జరిగింది. ఇక దొరస్వామిరాజు నిర్మాత కాగా రెండు పాటలు షూటింగ్ జరిగిన తర్వాత సినిమా అవుట్ పుట్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కి అనుమానం మొదలవడంతో నిర్మాత దొరస్వామిరాజు తో మాట్లాడి ఈ సినిమాతో హిట్ ఇస్తామా..ఇవ్వలేమా అనే అనుమానం తనకు ఉంది అని వెల్లడించారు.

ఇక ఆ తరువాత రాజమౌళి ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ కావడంతో కథ మార్చి సింహాద్రి సినిమాను తెరకెక్కించడం జరిగింది. అంతేకాదు అప్పటి వరకు చిత్రీకరించిన సన్నివేశాలను కూడా పూర్తిగా పక్కన పెట్టి మళ్లీ ఈ సినిమాను కొత్త గా తెరకెక్కించారు. అలా విడుదలైన ఈ సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లను సాధించింది. ఇక నాటి నుంచి నేటి వరకు అలుపెరుగని స్టార్ హీరో గా చలామణి అవుతూ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news