ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల పై తీసుకుంటున్న నిర్ణయంపై టాలీవుడ్ హీరోలు సీరియస్ గా ఉన్నారు. తాజాగా సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, నటీ నటులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై సినిమా టికెట్ల విషయం పై పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరో నాని, సిదార్థ్ తో పాటు పలువురు టాలీవుడ్ కు చెందిన వారు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సినిమా టికెట్ల నిర్ణయంపై స్పందించారు. కాగ హీరో నాని మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కానీ ఈ సారి ప్రభుత్వం పై కాకుండా టాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ లో ఐక్యత లేదని అన్నారు. అందరూ ఒకే తాటి పై ఉంటే ఈ సమస్య ఎప్పుడో పరిష్కారం అయ్యేదని అన్నారు. సినిమా టికెట్ల విషయం పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించిన సమయంలో అందరూ కూడా ఒకే తాటి పైకి వచ్చి పవన్ కళ్యాణ్ కు సపొర్టు చేస్తే ఈ సమస్య ఇప్పటికే పరిష్కారం అయ్యేదని అన్నారు. కానీ పవర్ కళ్యాణ్ సినిమా టికెట్ల గురించి మాట్లాడిన సమయంలో ఎవరూ ఏమీ అనకుండా నేడు అందరూ మాట్లాడుతున్నారని అన్నారు. కాగ సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా టికెట్లపై ఏపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.