కేసీఆర్ 150 ఎక‌రాల్లో వ‌రి ఎలా పండిస్తున్నారు : రేవంత్ రెడ్డి

-

వ‌రి వేస్తే ఉరే అని అన్న సీఎం కేసీఆర్ త‌న ఫామ్ హౌజ్ లో 150 ఎక‌రాల్లో వ‌రి పంట‌ను ఎలా పండిస్తున్నార‌ని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్రం యాసంగి వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేద‌ని కేసీఆర్ అన్నార‌ని అన్నారు. అలాగే రాష్ట్ర రైతుల‌ను కూడా వ‌రి వేయ‌వ‌ద్ద‌ని కేసీఆర్ హెచ్చ‌రించార‌ని గుర్తు చేశారు. కానీ కేసీఆర్ త‌న ఎర్ర‌వెల్లి ఫామ్ హౌస్ లో 150 ఎకరాలలో వ‌రి పంట‌ను ఎలా పండిస్తున్నార‌ని మండి ప‌డ్డారు. రేపు కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మంలో సీఎం కేసీఆర్ వ‌రి పొలం వివ‌రాల‌ను చూపిస్తాన‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

అలాగే రాష్ట్రంలో రైతులు పండించే వ‌రి తోపాటు ప్ర‌తి పంట‌ను కొనుగోలు చేయాల్సిన బాధ్య‌త రాష్ట్ర ప్ర‌భుత్వానిదే ఉంటుంద‌ని అన్నారు. కేంద్రం రాష్ట్రం నుంచి వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోయినా.. రాష్ట్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసి రైతుల‌ను ఆదుకోవాల‌ని అన్నారు. అలాగే రైతులు పండించే ప్ర‌తి పంట‌కు క‌నీస మ‌ద్ధ‌త్తు ధ‌ర క‌ల్పించాల్సిన బాధ్య‌త కూడా కేంద్ర ప్ర‌భుత్వానిదే అని అన్నారు. కానీ కేసీఆర్ ప్ర‌తి విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వం వైపు చూపి రైతుల‌ను ఆగం చేస్తున్నార‌ని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌ను ఆదుకోవాల‌ని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news