ఇందిరా దేవి గురించి ఎవరికీ తెలియని అతి కొన్ని రహస్యాలు ఇవే..!

-

సూపర్ స్టార్ కృష్ణ భార్య మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి మరణం ఆ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ముఖ్యంగా ఆమె మనవరాలు సితార తన నానమ్మ పై ఎంత ప్రేమను పెంచుకుందో మనకు ఇటీవల వచ్చిన కొన్ని ఫుటేజ్ లు చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే మహేష్ బాబుకు తల్లి అంటే ఎంతో ప్రాణం.. ఇంకా ఆమె గురించి చాలామందికి ఎన్నో తెలియని విషయాలు కూడా ఉన్నాయి.. నిజానికి ఇందిరా దేవి ఆరోగ్యం క్షీణించడానికి అసలు విషయం వేరే ఉందని తెలుస్తోంది. ఆమె పెద్ద కొడుకు రమేష్ బాబు మరణంతో ఆమె ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోవడం అదే విషయాన్ని తలుచుకుంటూ రోజూ మానసిక క్షోభకు గురి అవ్వడంతో తన ఆరోగ్యం క్షీణించింది. ఇక అలా నిన్న ఉదయం స్వర్గస్తురాలయ్యారు.

ముఖ్యంగా ఇందిరా దేవి గురించి చాలామందికి ఎన్నో విషయాలు తెలియవు.. ఆమె బయటకు వచ్చింది కూడా చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే అని చెప్పవచ్చు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకు మేనమామ కూతురు.. ఇక కృష్ణ అప్పుడే సినిమాల్లో స్టార్ గా ఎదుగుతున్న సమయంలో ఫ్యామిలీ అంతా పెళ్లి చేసుకోమని చెప్పడంతో ఇందిరను వివాహం చేసుకున్నారు. ఇక వీరి పెళ్లి తర్వాత రిలీజ్ అయిన గూడచారి సినిమా కృష్ణ జీవితంలోనే అతిపెద్ద బ్లాక్ బాస్టర్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆమె కృష్ణకు లక్కీ వైఫ్ కూడా అని అప్పట్లో చాలామంది ఆమెను పొగిడేవారు.

ఇక కృష్ణ, ఇందిరా దేవికి ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు. పెళ్లి తర్వాత కృష్ణకు ఎక్కువగా సినిమా ఆఫర్లు అలాగే వరుస విజయాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక విజయనిర్మల అప్పుడే కృష్ణకు పరిచయం అవడం ఆయన సరసన ఎన్నో సినిమాలలో నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే వీరి ప్రేమను కూడా ఓర్పుతో అంగీకరించింది. ఇక ఎంతో గొప్ప మనస్తత్వం కలిగిన ఈమె మరణించడం అందరికీ బాధాకరమని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news