కొత్త రిలీజ్ డేట్ల‌ను ప్ర‌క‌టిస్తున్న సినిమాలు ఇవే..!

-

క‌రోనా దెబ్బ‌కు ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. టాలీవుడ్‌ను ఈ వైర‌స్ చాలానే దెబ్బ తీసింద‌ని చెప్పాలి. షూటింగ్ పూర్తి చేసుకున్న పెద్ద సినిమాలు అన్నీ ఆగిపోయాయి. అయితే ఇప్పుడు ప‌రిస్థితులు కుదుట‌ప‌డ‌టంతో రేపోమాపో థియేట‌ర్లు కూడా ఓపెన్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ కొత్త రిలీజ్ డేట్ల‌ను ప్ర‌క‌టించేందుకు రెడీ అవుతున్నారు మేక‌ర్స్‌.

సినిమాలు

నాని న‌టించిన ‘టక్ జగదీష్ మూవీ అలాగే నాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్లి చేసిన లవ్ స్టోరీ మూవీలు ఇప్పుడు రిలీజ్‌కు ముందు వరుసలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా థియేటర్లు ఓపెన్‌చేస్తే రిలీజ్ డేట్ల‌ను ప్రకటించాలని ఈ మూవీ మేక‌ర్స్ ఎదురు చూస్తున్నారు.

కాగా 50శాతం ఆక్యుపెన్సీతో ఎలాగూ థియేట‌ర్లు ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది. దీంతో బాలకృష్ణ చేస్తున్న బిగ్ ప్రాజెక్టు అఖండ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలని చూస్తున్నారు. ఇక విరాటపర్వం, నారప్ప సినిమాలు కూడా త్వ‌ర‌లోనే రానున్నాయి. అలాగే ఆచార్య మూవీ ద‌స‌రా వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇక కేజీఎఫ్ ఛాప్టర్-2 కూడా త్వ‌ర‌లోనే వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news