ఇండియాలో టాప్‌ 10 రిచ్‌ హీరోలు వీళ్లే.. మొదటి స్థానంలో అతనే..!

-

ఎంత అందమైన హీరోయిన్‌కైనా తన హవా ముడు నాలుగు మహా అయితే ఐదు అంతకంటే ఎక్కువ ఉండదు. ముందు వచ్చిన అన్ని ఆఫర్స్ రావు. వాళ్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోతుంది. ఎప్పటికప్పుడు కొత్తవారికి ప్రాధాన్యత ఇస్తారు. కానీ హీరోల విషయంలో అలా ఉండదు. వాళ్లకు 47 దాటినా కూడా వాళ్ల డిమాండ్‌ కాస్త కూడా తగ్గదు. ఇంకా అంతకంతూ పెరిగిపోతుంది. అందుకు ఉదాహరణ ఇప్పుడు ఉన్న హీరోలు ఎంతోమంది. బాలకృష్ణ, చిరంజీవి, రజీనీకాంత్‌ లాంటి వాళ్లు ఇంకా సినిమాలు తీస్తూ రికార్డులు బ్రేక్‌ చేస్తున్నారు. ఒక్కో సినిమాకు వందలకోట్లు తీసుకుంటున్నారు. భారతదేశంలోని టాప్ 10 సంపన్న నటుల లిస్ట్‌ ఇదే..! ఇందులో మన తెలుగు హీరోలు కూడా ఉండటం విశేషం.

భారతదేశంలోని అత్యంత సంపన్న నటులలో షారుక్ ఖాన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు అందుకుంటున్నాడు. ఐపీఎల్‌లో అతడికి సొంత జట్టు ఉంది. సినిమా నిర్మాణ సంస్థ ఉంది. అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. అతని మొత్తం ఆస్తులు 6300 కోట్ల రూపాయలు.

బాలీవుడ్‌లో ఇంకో సంపన్న హీరో హృతిక్ రోషన్. ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటున్నాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.10 కోట్లు తీసుకుంటాడు. దుస్తులు-షూ బ్రాండ్‌ను కూడా కలిగి ఉన్నాడు. ఆయన ఆస్తి 3100 కోట్ల రూపాయలు.

ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అనేక దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ఆయన అనుభవం చాలా పెద్దది. సినిమాతో పాటు కౌన్ బనేగా కరోడ్ పతి అనే టెలివిజన్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక్కో సినిమాకు 10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. ఆయన ఆస్తి 3000 కోట్ల రూపాయలు.

బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌కు పెద్ద పేరు. అతను తన సొంత దుస్తుల బ్రాండ్, స్వచ్ఛంద సంస్థను కలిగి ఉన్నాడు. 57 ఏళ్లు దాటినా పెళ్లి ఆలోచనే రాలేదు. ఆయన ఆస్తి 2850 కోట్ల రూపాయలు.

బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ తన సినిమా పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. అందుకే ఏడాదిలో ఆయనవి మూడు-నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. ఆయన ఆస్తి 2,660 కోట్ల రూపాయలు. అత్యధిక పన్ను చెల్లించే హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు.

నటుడు అమీర్ ఖాన్ నటనకు విరామం ఇచ్చాడు. అలాగని ఆయనకు మార్కెట్‌లో డిమాండ్ తగ్గలేదు. చాలా వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. అతనికి సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ఆస్తి 1862 కోట్ల రూపాయలు.

రామ్ చరణ్ RRR సినిమా ద్వారా గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ చిత్రంలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ దక్కింది. ఈ స్టార్ నటుడికి చాలా డిమాండ్ ఉంది. ఆయన ఆస్తి విలువ 1370 కోట్ల రూపాయలు.

నటుడు, తెలుగు బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకు చాలా డిమాండ్ ఉంది. ఆయన ఆస్తి విలువ 950 కోట్ల రూపాయలు. ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. బిగ్ బాస్ కోసం రూ.15 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్‌.

కోలీవుడ్ స్టార్ యాక్టర్ రజనీకాంత్ సినిమా ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా కొనసాగుతున్నారు. ఆయన నటించిన జైలర్ సినిమా ఈ మధ్యనే రిలీజ్‌ అయింది.. సూపర్ హిట్ కూడా కొట్టింది. ఈ సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. ఆయన ఆస్తి దాదాపు 450 కోట్ల రూపాయలకు పైనే.

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఆస్తి 380 కోట్ల రూపాయలు. అతనికి సొంత మల్టీప్లెక్స్ ఉంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం ఇండియా మెుత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news