ఇండస్ట్రీకి రాజమౌళి పరిచయం చేసిన విలన్లు వీళ్లే..!

-

ఒక సినిమాను వెండితెరకు పరిచయం చేయడంలో జక్కన్నది ఒక ప్రత్యేక శైలి. ఒక కథను ఎన్నుకున్నప్పుడు ఆ కథకు తగ్గట్టుగా హీరో, హీరోయిన్లను ఎన్నుకోవడం ఒక ఎత్తయితే, అందుకు తగ్గట్టుగానే ప్రతి నాయకులను ఎన్నుకోవడంలో రాజమౌళి దిట్ట. రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలలో విలన్ పాత్రకు వారు కాకుండా వేరే వారిని ఊహించడం కూడా కష్టమే. మరి రాజమౌళి ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆ విలన్లు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రదీప్ రావత్..

సై సినిమాతో భిక్షు యాదవ్ గా బాలీవుడ్ నటుడు ప్రదీప్ రావత్ ను తెలుగు తెరపై పరిచయం చేశారు రాజమౌళి6 ఆ సినిమాలో అతని ఆకారం చూడగానే భయపడే విధంగా తీర్చిదిద్దారు జక్కన్న. సై సినిమా తరవాత వెనక్కి తిరిగి చూడకుండా దక్షిణాది సినిమాల్లో దూసుకెళ్ళాడు ప్రదీప్ రావత్. కేవలం విలన్ పాత్రలే కాకుండా తర్వాత కమెడియన్ గా అందరినీ ఆకట్టుకున్నారు.

దేవ్ గిల్..

రామ్ చరణ్ కి మగధీర లాంటి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన జక్కన్న. అదే సినిమాలో దేవ్ గిల్ ను విలన్ గా పరిచయం చేశారు. బాలీవుడ్ కి చెందిన దేవ్ గిల్ మొదట కృష్ణార్జున సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చారు. అయితే ఆ సినిమాతో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. తరువాత మగధీరలో రణదేవ్ బిల్లా పాత్ర ద్వారా ప్రజలను ఆకట్టుకోవడమే కాకుండా, తన కెరీర్ ని టాప్ రేంజ్ కి తీసుకెళ్లారు.

సుదీప్..

కన్నడ నటుడు సుదీప్ ని తన ఈగ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు రాజమౌళి. సుదీప్ కేవలం నటనలో మాత్రమే కాకుండా, డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్, హోస్ట్ కూడా. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సుదీప్ అప్పుడప్పుడు కీలక పాత్రల్లో కనిపిస్తుంటాడు.

అజయ్..

రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమా అనగానే వెంటనే గుర్తొచ్చే పాత్ర టిట్లా. ఈ పాత్రలో అజయ్ కాకుండా వేరే ఎవరు కూడా సూట్ కారు అన్నట్టు గా నటించి అందరిని మెప్పించారు. మొదట్లో సీరియల్ ఆర్టిస్ట్ గా బుల్లి తెరకు పరిచయమైన అజయ్, ఇప్పుడు ఇండస్ట్రీలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు.

సుప్రీత్..

సుప్రీత్ మర్యాదరామన్న సినిమాలో నటించారు. తను ఎన్ని సినిమాల్లో నటించినా కూడా చత్రపతి సినిమాలోని కాట్రాజ్ పాత్ర ఎక్కువగా గుర్తుంటుంది. ఆ సినిమాలో ఫస్ట్ ప్రభాస్ కి స్నేహితుడిగా సుప్రీత్ ను సెలెక్ట్ చేశారు రాజమౌళి. అయితే చివరి నిమిషంలో కాట్రాజ్ పాత్రను ఇచ్చారు. అదే అతనికి మంచి పేరు తీసుకొచ్చింది.

ప్రభాకర్..

బాహుబలి పార్ట్ 1 అందరిని కిలికిలి భాషతో మెప్పించిన కాలకేయ మంచి ప్రేక్షకాదరణ పొందారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్న ప్రభాకర్ కి సినిమాలో మెయిన్ విలన్ రోల్ ఇచ్చి ప్రోత్సహించారు జక్కన్న. అయితే మర్యాద రామన్న సినిమాలో తొలిసారిగా నటించాడు. కానీ బాహుబలిలో కాలకేయ పాత్రతో అందరిని మెప్పించారు.

రానా..

బాహుబలి పార్ట్ 2 లో నెగటివ్ రోల్ లో రానా నీ సెలెక్ట్ చేశారు రాజమౌళి. భల్లాలదేవగా ప్రభాస్ తో పోటీపడి రానా నటించాడు. అప్పటి వరకు సినిమాల్లో హీరోగా నటించిన పెద్దగా పేరు సంపాదించని రానా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు భల్లాలదేవ గుర్తుండిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news