రాజమౌళిపై ఫాన్స్ సీరియస్…!

-

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తెలంగాణా ప్రాంత వీరుడు కొమరం భీమ్ పాత్రలో జూనియర్ నటిస్తుండగా, ఆంధ్రాప్రాంతానికి చెందిన వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తున్నాడు. చారిత్రాత్మక ఫ్రిక్షన్ గా ఈ సినిమా వస్తుంది.

ఇక ఈ సినిమాలో బాలివుడ్, హాలివుడ్ నటులు కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన అలియా బట్ నటిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్ నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా మీద జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమాను జూన్ లో లేదా జూలై లో విడుదల చేస్తారని భావించారు అంతా.

ఆ తర్వాత దసరా కానుకగా ఈ సినిమా వస్తుందని చిత్ర యూనిట్ చెప్పింది. అయితే ఇప్పుడు దాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. దీనిపై ఫాన్స్ ఆగ్రహంగా ఉన్నారు. ఆర్ అంటే రిలీజ్ అని ఆర్ అంటే రీరిలీజ్ అని ఆర్ అంటే రీరీరిలీజ్ అంటూ అంటూ ఆర్ఆర్ఆర్ కి కొత్త అర్ధం చెప్పడం మొదలుపెట్టారు. ఏంటి రాజమౌళి గారు మాకు ఈ నస…? ఇంకో ఏడాది ఆగాలా అంటూ ఫైర్ అవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news