Big Boss OTT Telugu: కిల్లర్ పనులకు భయపడుతున్న కంటెస్టెంట్స్..ఇంతకీ ‘బిగ్ బాస్’ కిల్లర్ ఎవరు?

తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ సిక్స్ OTT వర్షన్ తొమ్మిదో వారంలోకి ఎంటర్ అయింది. ‘బిగ్ బాస్’..మంగళవారం ఎపిసోడ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కెప్టెన్సీ కంటెండర్ టాస్కులో భాగంగా ‘బిగ్ బాస్’ ఒక కిల్లర్ ను నియమించారు. ఆ కిల్లర్ చేసే పనులతో కంటెస్టెంట్స్ సతమతమవుతున్నారు.

ఇంటి సభ్యుల్లో కిల్లర్ ఎవరు? అనే ఆందోళన స్పష్టంగా కనబడుతోంది. ప్రతీ ఒక్కరు కిల్లర్ ఎవరు అనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ, కిల్లర్ తానే అనేది తెలియకుండా సదరు కిల్లర్ జాగ్రత్తపడుతున్నాడు. అలా మంగళవారం నాటి ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.

‘బిగ్ బాస్’ అపాయింట్ చేసిన కిల్లర్ కు టైమ్ టు టైమ్ ఇన్ స్ట్రక్షన్స్ అందుతుండటం, అలా ‘బిగ్ బాస్’ చెప్పినట్లుగానే కిల్లింగ్స్ జరుగుతుండటం చూసి కంటెస్టెంట్స్ ఆందోళన చెందుతున్నారు. అయితే, ‘బిగ్ బాస్’ అపాయింట్ చేసిన కిల్లర్ నటరాజ్ మాస్టర్ అని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు.

ఈ వారం కిల్లర్ నటరాజ్ మాస్టర్ పర్ఫార్మెన్స్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా ‘బిగ్ బాస్’తో ఫోన్ లో మాట్లాడుతూ కంటెస్టెంట్స్ ను భయపెట్టేశాడు. అలా ఈ వారం నామినేషన్ నుంచి డెఫినెట్ గా తప్పించుకునే చాన్సెస్ దక్కించుకున్నాడు నటరాజ్ మాస్టర్. చూడాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో..