గౌతమ్ రాజు మృతిపై టాలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి.. పవన్ ఎమోషనల్ !

-

టాలీవుడ్ ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు మరణించారు. 68 సంవత్సరాల గౌతమ్ రాజు నిన్న రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఎడిటర్ గౌతమ్ రాజు అర్ధరాత్రి ప్రాణాలు కోల్పోయారు. తెలుగు, తమిళం అలాగే కన్నడ భాషల్లో సుమారు 800 సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. తెలుగులో ఖైదీ 150, బలుపు, ఊసరవెల్లి, డాన్ శీను, డిటెక్టర్, గబ్బర్ సింగ్, కిక్, బద్రీనాథ్, రేసుగుర్రం, సౌఖ్యం, అదుర్స్ మరియు గోపాల గోపాల లాంటి సినిమాలకు గౌతమ్ రాజు ఎడిటర్ గా పనిచేశారు. ఇక గౌతమ్ రాజు మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కూడా ఎమోషనల్ అయ్యారు.

“శ్రీ గౌతమ్ రాజు గారు మృతి విచారకరం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎడిటర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందిన శ్రీ గౌతమ్ రాజు గారు కన్నుమూయడం విచారకరం. ఎడిటర్ గా వందల చిత్రాలకు పని చేసిన అనుభవశాలి ఆయన. ఆ విభాగంలో సాంకేతికంగా ఎప్పటికప్పుడు వచ్చే మార్పులను అందిపుచ్చుకొన్నారు. నేను నటించిన ‘గోకులంలో సీత’, ‘సుస్వాగతం’, ‘గబ్బర్ సింగ్’, ‘గోపాల గోపాల’ చిత్రాలకు శ్రీ గౌతమ్ రాజు గారు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.” అంటూ పవన్ పేర్కొన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news