U19 ప్రపంచ కప్ కి సిరిసిల్లకి చెందిన యువకుడు

-

ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న రాజన్న సిర్సిల్ల నియోజకవర్గం నుంచి అవనిష్ రావు అనే యువకుడు U 19 ప్రపంచ కప్ కి ఎంపిక అయ్యాడు.కేటీఆర్ అతనికి అభినందనలు తెలుపుతూ తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.దక్షిణాఫ్రికాలో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ , ట్రై సిరీస్‌లకు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అరవెల్లి అవనీష్‌‌ రావు ఎంపిక అయ్యాడు.

అరవెల్లి అవనీష్ రావు స్వగ్రామం ముస్తాబాద్ మండలంలోని పోత్గల్. చిన్ననాటి నుంచే క్రికెట్ పై మక్కువ పెంచుకున్న ఈ యువకుడు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కు వికెట్ కీపర్ గా ఎంపికవ్వడం పట్ల జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.నిజంగా అవనీష్‌‌ రావు తల్లిదండ్రులకు దండాలు..పిల్లలకు తమకు ఇష్టమైన రంగంలో ప్రోత్సహించడం.. ముందుకు తీసుకెళ్లడం అభినందనీయం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఐనందుకు సంతోషిస్తున్నం.కాంగ్రాట్స్‌‌ అవనీష్‌‌ నానీ.. అని తెలంగాణా పేరు నిలబెట్టి క్రీడల్లో రాణించిలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news