కాక పుట్టిస్తున్న అన్ స్టాపబుల్ పవన్ ఎపిసోడ్..!!

-

తాజాగా బాలయ్య – పవన్ ఎపిసోడ్ పార్ట్ 2 ని విడుదల చేశారు. ఫిబ్రవరి 10వ తేదీన రిలీజ్ చేస్తామని ప్రకటించినా కూడా అభిమానుల కోసం ముందుగానే ట్రీట్ ఇద్దామని ఫిబ్రవరి 9 రాత్రి రిలీజ్ చేయడం జరిగింది.. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఏ రేంజ్ లో వైరల్ అయిందో.. ఎపిసోడ్ అంతకుమించి వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఆహా ఓటీటీ లో బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ షో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఎపిసోడ్ ఆద్యంతం హీటు పుట్టిస్తోందని చెప్పవచ్చు. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గానే ఏపీ ప్రభుత్వంపై పంచులు సెటైర్లు వేశారు.. విమర్శించారు.. పవన్ కళ్యాణ్ కి ఏపీ ప్రభుత్వం పెట్టే ఇబ్బందులు.. ఏపీ ప్రభుత్వం చేసే పనుల గురించి ఆయన వివరించారు.

మరోవైపు పవన్ కళ్యాణ్ చేస్తున్న మంచి పనులను బాలయ్య బాబు అభినందించగా మొత్తానికి ఎపిసోడ్ అంతా పొలిటికల్ టాపిక్స్ తోనే సాగింది. వైసిపి నాయకులు ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం పవన్ కళ్యాణ్, బాలయ్య లపై విమర్శలు చేయడం ఖాయం అంటూ వార్తలు వినిపిస్తున్నాయి నేడు కొంతమంది వైసిపి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరొకవైపు అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ఎపిసోడ్ని వైరల్ చేస్తున్నారు.

ఇకపోతే ఏపీ ప్రభుత్వం గురించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇక ఈ ఎపిసోడ్ తో బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 గ్రాండ్గా ముగిసింది. మరి మూడవ సీజన్ ఏ విధంగా ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news