Unstoppable: సీజన్ 2 ట్రైలర్ వచ్చేస్తోంది..!!

-

నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్-2 షో కోసం ఎంతోమంది అభిమానులు సైతం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ షో ఆహ లో ప్రసారం కానుంది. ఈ షోలో బాలకృష్ణ తన మాటలతో సెన్సాఫ్ హ్యూమర్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంటారు. సినిమాలలో ఒకవైపు బిజీగా ఉండగానే.. మరొకవైపు ఇలాంటి షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు బాలకృష్ణ. దీంతో పాపులర్ అవ్వడమే కాకుండా రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగానే సంపాదిస్తూ ఉన్నారు. అన్ స్టాపబుల్ షో అన్నిటికంటే నెంబర్ వన్ స్థానంలో నిలబడిందని చెప్పవచ్చు. ఇందులో ఎంతోమంది స్టార్ హీరోలు సైతం తమ మాటలతో సరదా సంభాషణలతో బాలకృష్ణ మొదటి సీజన్ ని చాలా ఘనవిజయంగా పూర్తి చేశారు.

ఇప్పటికే అన్ స్టాపబుల్ -2 సీజన్ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇస్తూ వుండగా.. అటు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రస్తుతం చివరి దశలో ఉన్నది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే అన్ స్టాపబుల్ -2 సీజన్లో పాల్గొనబోతున్నారు. ఇటీవలే ఈ టాక్ షో కి సంబంధించి ఒక సాంగ్ ను కూడా విడుదల చేయడం జరిగింది. NBK -2 టైటిల్ సాంగ్ ను రివీల్ చేశారు ఆహా సంస్థ.

దీంతో ప్రేక్షకులలో ఈ పాట బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తాజాగా అన్ స్టాపబుల్ ట్రైలర్ ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయబోతున్నారని వార్తని ఒక పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఈ పోస్టర్ లో బాలయ్య కౌబాయ్ గెటప్ లో కనిపిస్తూ ఉండగానే బాలయ్య ఈస్ బ్యాక్ అని ఒక పేరుతో తన పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. మరి ఈ షో కి ఎవరు గెస్ట్ గా వస్తారనే విషయం ప్రేక్షకులలో చాలా ఆసక్తికరంగా మారుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news