మోర్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం

-

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మోర్ సూపర్ మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఫస్ట్ ఫ్లోర్ ను మంటలు చుట్టుకున్నాయి. దట్టమైన పొగమంచు కప్పేయడంతో స్థానికులు భయాందోళన చెందారు. అక్కడి నుంచి పరుగులు పెట్టారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేపడుతున్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని సమాచారం. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు . ఇదిలా ఉంటే.. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఆకవీడు గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ లో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో బ్యాంక్ లోని రెండు ఏసీలు ఐదు కంప్యూటర్లు ముఖ్యమైన డాక్యుమెంట్లు కాలిపోయినట్లు బ్యాంక్ అధికారులు తెలిపారు.

ప్రమాదం చోటు చేసుకున్న సమయంలో బ్యాంక్ లో ఉన్న ప్రజలు అధికారులు సిబ్బంది బయటకు పరుగులు తీశారు. చేతికందిన కంప్యూటర్లు నగదుతో సిబ్బంది బ్యాంక్ నుండి బయటపడ్డారు. తర్వాత మంటలు దావాలంగ వ్యాపించి మంటలలో ఏసీలు, ఫర్నిచర్, కంప్యూటర్లు ఆహుతి అయ్యాయి. అప్పటికే బ్యాంక్ లోని సేఫ్టీ సిలిండర్ నీళ్లతో గ్రామస్తులు మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మంటలు అదుపు కాకపోవడంతో అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు మంటలను ఆర్పి వేశారు. అగ్ని ప్రమాదం వల్ల సుమారు బ్యాంకులో 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక నష్టం జరిగినట్లుగా సంబంధిత అధికారులు తెలిపారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version