‘వకీల్ సాబ్’ వసూళ్ల వర్షం.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న వపన్!

-

పవర్ స్టార్ పవన్ కల్యాన్ కు ఉన్న మార్కెట్ టాలీవుడ్ లో మరే హీరోకు లేదు. ప్లాప్ అయిన సినిమాలు కూడా కలెక్షన్స్ పరంగా రికార్డులు సృష్టించిన చరిత్ర కూడా పవన్ కే సొంతం. సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన వకీల్ సాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోందంటే పవన్ మానియా ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ మూవీ అన్ని రకాల ఆడియన్స్ కు నచ్చడంతో జనాలు కొవిడ్ ను కూడా లెక్కచేయకుండా థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఏప్రిల్ 9న విడుదల ఈ చిత్రం బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఫస్డ్ డే నుంచి కలెక్షన్ల వరద పారిస్తున్న వకీల్ సాబ్ ఇప్పటికే నైజ100 కోట్ల క్లబ్‌లో చేరిపోయింది.

అయితే అధికారికంగా వకీల్ సాబ్ లెక్కలు ప్రకటించాల్సి ఉండగా.. ట్రేడ్ మేథావులు తొలివారానికి సంబంధించిన కలెక్షన్స్ను అంచనా వేసి చెప్పారు. తొలిరోజు 40.10 కోట్లు వసూలు చేసిందాని చెప్పారు. మొత్తంగా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు రూ.100. 75 కోట్లు సాధించినట్టు సినీ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఇక నైజాం ప్రాంతంలో వకీల్ సాబ్ తన హవా కొనాసాగిస్తున్నాడు. తొలివారంలో మొత్తంగా రూ.30 కోట్లు వసూలు చేసినట్టు సమాచారం. సీడెడ్‌లో రూ.15 కోట్లు దాటాయని, ఇక ఉత్తరాంధ్రలో రూ.12 కోట్లు పైనే వసూలు చేసిందని సినీ నిర్మాతలు లెక్కలేసుకుంటున్నారు. ఇక రెండు రోజులు ఉగాది, అంబేద్కర్ జయంతి సెలవులు వరుసగా రావడంతో కలెక్షన్ల సునామీ ప్రవహిస్తోంది. ఇలాగే కొనసాగితే ఈ వారాంతంలో రూ.200కోట్ల మార్కుకు చేరుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news