అర్నాబ్ గోస్వామిపై వర్మ చిత్రం… “అర్నాబ్” ది న్యూస్ ప్రొస్టిట్యూట్.

-

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేసారు. తాను న్యూస్ యాంకర్ మరియు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిపై ఒక చిత్రం చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటన చేసారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా ఆయన వరుస ట్వీట్ లు చేసారు. ఆయన  ఈ సినిమా ను ఎందుకు చేయాలి అనుకునేది ట్విట్టర్ లో వివరించారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై బాలీవుడ్ లో ఉన్న పరిస్థితుల గురించి ఈ ఛానల్ చాలా వరకు చర్చలు జరిపింది.

దీనిపై స్పందించిన వర్మ… అర్నాబ్‌ గోస్వామి బాలీవుడ్ గురించి ఇంత భయంకరమైన రీతిలో మాట్లాడటం చూసి షాక్ అయ్యాను అని వర్మ పేర్కొన్నారు. అతను దీనిని క్రిమినల్ కనెక్షన్‌లతో ఎప్పుడూ డర్టియెస్ట్ ఇండస్ట్రీ అని పిలుస్తాడని మండిపడ్డారు. ఇది రాపిస్టులు, గ్యాంగ్‌స్టర్లు, లైంగిక దోపిడీదారులు ఉండేది బాలీవుడ్ కాదని అన్నారు. అర్నాబ్‌ గోస్వామి… దివ్య భారతి, జియా ఖాన్, శ్రీదేవి మరియు సుశాంత్ మరణాలను ఒక కేసుగా కలిపి బాలీవుడ్ ని హంతకుడిగా చూపించారు అని ఆయన పేర్కొన్నారు. 4 మరణాలు దాదాపు 25 సంవత్సరాల వ్యవధిలో జరిగాయన్నారు.

“దివ్య, జియా, శ్రీదేవి మరియు సుశాంత్ యొక్క నాలుగు కేసులలో పూర్తిగా భిన్నమైన వ్యక్తులు మరియు పరిస్థితులు ఉన్నాయన్నారు. అయితే అర్నాబ్ మనస్సులో వారంతా ఒకరే అని మండిపడ్డారు. అందరిని బాలీవుడ్ చంపేసింది అని ఆయన చెప్పినట్టు ఆరోపించారు. తను చర్చలు జరుపుతున్న సమయంలో కనీసం ఎవరి మాట వినరు అంటూ మండిపడ్డారు. దీనిని తను చాలా తీవ్రంగా తీసుకున్నట్టు వర్మ పేర్కొన్నారు. అందుకే అర్నబ్ పై ఒక సినిమా చేస్తా అని ఆయన ప్రకటించారు. అతన్ని ఈ సినిమాలో అర్ధనగ్నంగా నిలబెడుతాను అని స్పష్టం చేసారు.

చివరకు వర్మ అప్పుడు సినిమా పేరుని ప్రకటించారు. “అర్నాబ్” ది న్యూస్ ప్రొస్టిట్యూట్. అతనిని విస్తృతంగా అధ్యయనం చేసిన తరువాత, ట్యాగ్‌లైన్ ది న్యూస్ పింప్ లేదా ది న్యూస్ ప్రాస్టిట్యూట్ అని ఆయన చెప్పుకొచ్చారు. తాను చాలా దారుణమైన భాషను వాడా అని, ఆ భాష అర్నబ్ నుంచే తీసుకున్నా అని పేర్కొన్నారు. మరో ట్వీట్ కూడా చేసారు వర్మ… “హే అర్నాబ్‌ గోస్వామి మీరు నా చిత్రానికి ప్రతిస్పందిస్తారా లేదా అనేది తనకు అనవసరం అన్నారు. నన్ను తిట్టినా సరే పట్టించుకోను అనేది చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news