ఎన్టీఆర్‌పై వ‌ర్మ సంచ‌ల‌న కామెంట్లు.. ఏకంగా అలా అనేశాడేంటి!

త‌ర‌చూ ఏదో ఒక కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ చేసి సంచలనంగా మారుతుండాటు డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ‌. సోష‌ల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలపై వ్యంగ్యంగా పోస్ట్ లు పెడుతూ రచ్చ చేస్తుంటాడు వ‌ర్మ‌. ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాన్ మీద‌, చిరంజీవి మీద త‌న‌దైన కామెంట్లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. ఇక ఏపీ రాజ‌కీయాల‌పై వ‌ర్మ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మార్కును చూపిస్తూ ఘాటైన కామెంట్లు చేస్తుంటాడు.

ఇక ఈ మధ్యకాలంలో ఆయన ఏపీ రాజకీయాలపై చేస్తున్న‌ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ఆయ‌న తెర‌కెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను సరిగ్గా ఎన్నికల సమయంలో విడుదల చేసి టీడీపీపై వ్య‌తిరేక‌త ఏర్ప‌డేలా చేశాడు. దీని తరువాత ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డ‌లు’ అంటూ జగన్కు స‌పోర్టుగా సినిమా చేశాడు. దీంతో ఏపీ రాజ‌కీయాల్లో హీటు పుట్టింది.
తాజాగా చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఘాటైన విమ‌ర్శ‌లు చేశాడు. టీడీపీ పార్టీకి నారా లోకేష్ కరోనా వైరస్ లాంటి వాడని.. దానికి వ్యాక్సిన్ తారక్ మాత్రమేనని సంచ‌ల‌న కామెంట్లు చేశాడు. టీడీపీ వర్గాలు వీలైనంత త్వ‌ర‌గా నారా లోకేష్ అనే డేంజరస్ వైరస్‌ ని తరిమికొట్టి తారక్ అనే వ్యాక్సిన్ ని తీసుకోవాలని లేదంటే..మ ప్రమాదకరమని పోస్టు చేసి వివాదం సృష్టించాడు. ఇక వ‌ర్మ చాలా కాలంగా టీడీపీని టార్గెట్ చేస్తూ.. తారక్ చేతిలో పార్టీని పెట్టాలంటూ చెప్తున్నాడు. ఒక్క తారక్ మాత్రమే టీడీపీ పార్టీని కాపాడగలడ‌ని గతంలో వర్మ ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పిన విష‌యం తెలిసిందే. మ‌రి దీనిపై టీడీపీ త‌మ్ముళ్లు ఎలా స్పందిస్తారో చూడాలి. ఏదేమైనా వ‌ర్మ మ‌ళ్లీ బ్యాక్ అంటున్నారు ఆయ‌న అభిమానులు.