ప్ర‌భాస్ ఆదిపురుష్‌లో మ‌రో హీరో.. ఎవ‌రో తెలుసా..?

ప్ర‌భాస్ ఒక‌ప్పుడు తెలుగులో మాత్ర‌మే స్టార్‌గా ఉన్నారు. కానీ ఎప్పుడైతే బాహుబ‌లి వ‌చ్చిందో అప్ప‌టి నుంచి ఆయ‌న నేష‌న‌ల్ స్టార్‌గా అవ‌త‌రించారు. అప్ప‌టి నుంచి ఆయ‌న అన్ని ప్యాన్ ఇండియ‌న్ మూవీలే చేస్తున్నారు. ఇక ఇప్పుడు కూడా ఆయ‌న ఓ ప్ర‌తిష్టాత్మ‌క సినిమా అయిన ఆదిపురుష్ లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. దీన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ తెర‌కెక్కిస్తుండ‌టంతో బాలీవుడ్ లో దీనిపై భారీగానే అంచ‌నాలు ఉన్నాయి.

ఈ మూవీలో డార్లింగ్ ప్రభాస్‌ రాముడిగా చేస్తుండ‌గా.. రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్ న‌టించ‌డంతో బాలీవుడ్ లో స్టార్ న‌టుల‌నే ఎక్కువ‌గా తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే సీతగా కృతి సనన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్ చేస్తుండ‌టంతో ఈ మూవీకి బాలీవుడ్‌లో మార్కెట్ బాగానే ఏర్ప‌డింద‌ని తెలుస్తోంది. ఇక ఇప్పుడు మ‌రింత మార్కెట్‌ను పెంచే విష‌య‌మై ఇందులో మ‌రో హీరోను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

ఆదిపురుష్ మూవీ కోసం ప్రముఖ హిందీ టీవీ ఆర్టిస్టు, హీరో వత్సల్‌ సేథ్ ను తీసుకుంటున్నారు మూవీ మేక‌ర్స్‌. ఇప్ప‌టికే ఆయ‌న షూటింగ్‌లో కూడా పాల్గొన్నారు. ఈ ఆదిపురుష్ మూవీలో వత్సల్ చాలా ఇంపార్టెంట్ రోల్‌లో క‌నిపిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న బాలీవుడ్‌లో పలు సీరియళ్లతో పాటు టార్జాన్‌ ది వండర్‌ కార్ అలాగే సల్మాణ్‌ జైహో లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీల్లో చేశారు. ఇలా బాలీవుడ్ స్టార్ల‌ను తీసుకుని ప్ర‌భాస్ మార్కెట్‌ను బాలీవుడ్‌లో బాగా పెంచేందుకు ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.