పాడి కౌశిక్‌రెడ్డికి టీఆర్ఎస్‌లో కూడా సీటు లేన‌ట్టేనా.. చేరిక‌పై నోరు విప్ప‌ని గులాబీ పెద్ద‌లు..!

-

పాడి కౌశిక్‌రెడ్డి ( Kaushik Reddy Padi ) పేరు ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లో మార్మోగి పోతోంది. ఆయ‌న మొన్న‌టి దాకా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తార‌ని అంతా భావించారు.కానీ అనూహ్యంగా రేవంత్‌కు టీపీసీసీ పగ్గాలు ఇవ్వ‌డంతో ఆయ‌న కూడా కొంత సందిగ్ధంలో ప‌డ్డారు. ఎందుకంటే క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్‌కు టికెట్ ద‌క్కుతుంద‌నే ప్రచారం సాగింది. ఇక రేవంత్ కూడా ఇన్ చార్జుల‌ను నియ‌మించ‌క‌పోవ‌డం, అలాగే కౌశిక్‌రెడ్డిని అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఈ అనుమానాలకు మ‌రింత బ‌లం చేకూరింది.

Kaushik Reddy Padi | పాడి కౌశిక్‌రెడ్డి
Kaushik Reddy Padi | పాడి కౌశిక్‌రెడ్డి

ఇక ఈ క్ర‌మంలోనే కౌశిక్‌రెడ్డి ఆడియో లీక్ కావ‌డం అందులో ఆయ‌న బీజేపీ కార్య‌క‌ర్త‌తో టీఆర్ ఎస్ టికెట్ క‌న్ఫ‌ర్మ్ అయింద‌ని చెప్ప‌డంతో కాంగ్రెస్ దీన్ని చాలా సీరియ‌స్‌గా తీసుకుంది. దీంతో పార్టీ యాక్ష‌న్ తీసుకునే లోపే ఆయ‌నే రాజీనామా చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్రెస్‌మీట్‌లో కూడా రేవంత్‌పైనే విమ‌ర్శ‌లు చేశారు. కానీ ఆడియో లీక్‌పై ఎలాంటి కామెంట్లు చేయ‌లేదు. ఇక మూడు రోజుల్లో భ‌విత‌వ్యం ప్ర‌క‌టిస్తాన‌ని చెప్ప‌డంతో ఆయ‌న టీఆర్ఎస్‌లోకి వెళ్ల‌డం ఖాయం అని అంతా అనుకున్నారు.

ఇక టీఆర్ఎస్ పెద్ద‌లు కూడా ఈట‌ల‌ను ఎదుర్కోవాలంటే కౌశిక్‌రెడ్డి మాత్ర‌మే ఆప్ష‌న్ అని భావించ‌డంతో ఆయ‌న‌కు టికెట్ కూడా ఖాయ‌మని అంతా భావించారు. ఈ నెల 16న టీఆర్ ఎస్‌లో 2వేల మందితో టీఆర్ ఎస్‌లో చేరుతున్న‌ట్టు కూడా కౌశిక్‌రెడ్డి ఇంటిమేష‌న్ ఇచ్చారు. కానీ దీనిపై టీఆర్ ఎస్ పార్టీ ఎలాంటి సంకేతాలు ఇవ్వ‌లేదు. దీంతో పాటు వివాదాల‌కు పాడి కౌశిక్‌రెడ్డి కేంద్ర బిందువుగా మారండంతో ఆయ‌న్ను పార్టీలో చేర్చుకుంటే పార్టీ ఇమేజ్ దెబ్బ తింటుంద‌ని పెద్ద‌లు భావిస్తున్నారు. ఈ కార‌ణంగానే ఇంకాస్త స‌మ‌యం ఆలోచిస్తున్న‌ట్టు స‌మ‌చారాం. ఇక టికెట్ విష‌యంలో కూడా ఇత‌ర అభ్య‌ర్థుల‌పై స‌ర్వే చేయిస్తున్నారు కేసీఆర్ టీమ్‌. మ‌రి కౌశిక్‌రెడ్డి భ‌వితవ్యం ఎటు వైపు వెల్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news