నాని రియల్ నేచురల్ యాక్టర్.. జెర్సీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వెంకటేష్..!

-

నాని, గౌతం తిన్ననూరి కాంబోలో క్రికెట్ నేపథ్యంతో వస్తున్న సినిమా జెర్సీ. ఈ సినిమా ఏప్రిల్ 19న రిలీజ్ అవుతుండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం సాయంత్రం జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అయ్యారు. జెర్సీ సినిమా కేవలం క్రికెట్ నేపథ్యంతో వచ్చింది కాబట్టి ఈ సినిమా ఈవెంట్ కు రాలేదని ఈ మూవీ పోస్టర్స్ నుండి తాను ఫాలో అవుతున్నట్టు చెప్పాడు వెంకటేష్.

ఇక నాని తెలుగు ఇండస్ట్రీలోనే ఫైనెస్ట్ యాక్టర్ అని. ఏకైన నేచురల్ యాక్టర్ దీనికి ఫ్యాన్స్ గర్వంగా ఫీలవ్వాలని అన్నారు. ట్రైలర్ చూడగానే నచ్చేసింది. ఇలాంటి సినిమాలు ఎమోషనల్ గా ఉండి స్పూర్తిని నింపుతాయి. ఒరతి ఒక్కరి లైఫ్ లో స్ట్రగుల్స్ ఉంటాయి. ఓటమి నుండి నేర్చుకుంటారు. జీవితంలో ఓటమిని ఎదుర్కోండి.. కాని దానికి తలవంచొద్దు.. జెర్సీ ద్వారా నాని అదే చేసి చూపించాడని అన్నారు. ఎ సినిమా అందరికి టచ్ చేస్తుందని అన్నారు వెంకటేష్.

Read more RELATED
Recommended to you

Latest news