పార్లమెంట్ ప్రారంభోత్సవం కాంట్రవర్సీ.. విపక్షాలకు మోదీ కౌంటర్‌

-

పార్లమెంట్ నూతన భవనం ప్రారంభోత్సవంపై అధికార పార్టీ విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తున్నందున ఈ వేడుకను బహిష్కరిస్తూ విపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల నిర్ణయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా తప్పుపట్టారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు.

ఆరు రోజుల విదేశీ పర్యటనను ముగించుకొని మోదీ గురువారం ఉదయం భారత్‌ చేరుకున్నారు. ఈ క్రమంలో దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ప్రవాస భారతీయులతో జరిగిన సభను ప్రధాని ప్రస్తావిస్తూ.. ‘‘అందులో 20 వేలమంది పాల్గొన్నారు. ఆ దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, మాజీ ప్రధాని, ఇతర విపక్ష ఎంపీలు, నేతలు వచ్చారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ అందులో పాల్గొన్నారు. ఒక కమ్యూనిటీ ఈవెంట్‌కు వారంతా కలిసికట్టుగా హాజరయ్యారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారు’ అని మోదీ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news