విజయ్ క్రేజ్ అలా వాడేస్తున్నారు…!

-

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సంచలనాలు అందరికి తెలిసిందే. పెళ్లిచూపులు నుండి టాక్సీవాలా వరకు నాలుగు హిట్లు కొట్టిన విజయ్ దేవరకొండ తెలుగుతో పాటుగా తమిళంలో కూడా క్రేజ్ తెచ్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు. కోలీవుడ్ లో నోటా అంటూ ఓ ప్రయత్నం చేసిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో సక్సెస్ అందుకోలేదు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ తమిళంలో తన సినిమా రిలీజ్ చేయబోతున్నాడు.

తమిళంలో అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ కానుంది. అదేంటి ఆ సినిమా రీమేక్ గా తమిళంలో ధ్రువ్ వర్మ సినిమా వస్తుంది కదా అంటే.. వస్తుంది అయితే ఈ అర్జున్ రెడ్డి సినిమా అది కాదు విజయ్ నటించిన ద్వారక సినిమాను తమిళంలో అర్జున్ రెడ్డిగా రిలీజ్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి టైటిల్ తో విజయ్ కు బాగా క్రేజ్ వచ్చింది కనుక ఆ టైటిల్ పెట్టి సినిమా మీద హైప్ తీసుకొస్తున్నారు. తెలుగులో ద్వారక సినిమా పెద్దగా ఆడలేదు. మరి తమిళంలో అర్జున్ రెడ్డిగా వస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news