జగన్ పాత్రలో నటిస్తున్నాడా..!

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఉన్న ఫాం చూస్తే స్టార్ హీరోలు సైతం విస్తుపోయేలా ఉన్నారు. మూడు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ రేంజ్ అందుకున్న విజయ్ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్నాడు. అది కాకుండా తెలుగు, తమిళ భాషల్లో వస్తున్న నోటా సినిమా కూడా క్రేజీ ప్రాజెక్ట్ గా కనిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా వైఎస్సార్ బయోపిక్ లో జగన్ పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అంటున్నారు.

వై.ఎస్.ఆర్ జీవిత కథతో వస్తున్న ఈ యాత్ర సినిమాలో జగన్ గా సూర్య, కార్తిలలో ఒకరు నటిస్తారని అన్నారు. కాని ఇప్పుడు ఆ రోల్ కోసం విజయ్ తో సంప్రదింపులు చేస్తున్నారట. తెలంగాణా మెగాస్టార్ గా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ జగన్ పాత్రలో నటిస్తే ఆంధ్రాలో భారీ ఫాలోయింగ్ వచ్చి తీరుతుంది. మహి వి రాఘవ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news