ఏది వార్త ? : మెగా ఉద్య‌మం ఫ‌లిస్తుందా?

అబ‌ద్ధాలో నిజాలో ఏవో ఒక‌టి ఇండ‌స్ట్రీలో ఎప్ప‌టిక‌ప్పుడు వివాదాల‌కు కార‌ణం అయి ఉంటాయి.జ‌గ‌న్ కూడా ఇలాంటి వార్త‌ల‌కు బాధితుడే! ఇప్పుడు చిరు మ‌రోసారి బాధితుడు అయి ఉన్నాడు. త‌న‌పై అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్న వారు ఒక్క‌టి తెలుసుకోవాల‌ని తాను కొంత‌కాలంగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌ని, దీనిపై వివాదం చేయ‌డం త‌గ‌ద‌ని అంటూ మ‌రోసారి నిన్న‌టి వేళ మీడియా ఎదుట కొంద‌రి డౌట్స్ ను క్లారిఫై చేశారు. ఆయ‌న చెప్పిన త‌రువాత కూడా వార్త‌లు రావ‌డంతో మెగా క్యాంప్ లో ఆగ్ర‌హావేశాలు పెరిగిపోతున్నాయి.

ఈ క్ర‌మంలో గివ్ న్యూస్ నాట్ వ్యూస్ అనే ఉద్య‌మం ఒక‌టి చిరు మొద‌లు పెట్టి సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఈ ఉద్య‌మానికి విజ‌య్ దేవ‌ర కొండ‌తో స‌హా చాలామంది సెల‌బ్రిటీలు అండ‌గా ఉండ‌డ‌మే కాదు తాము గ‌తంలో ఎదుర్కొన్న వార్త‌లు సంబంధిత క‌థ‌నాలు గురించి గొంతు విప్పి మాట్లాడుతున్నారు మ‌రోసారి. నిజంగా ఇది ఒక శుభ ప‌రిణామ‌మే!

చిరంజీవితో పాటు ఇంకొంద‌రు మీడియా బాధితులే! వీరంతా ఇప్పుడిప్పుడే గొంతు  విప్పుతున్నారు. త‌ప్పుడు వార్త‌లు రాసే వారిపై గ‌ళం వినిపిస్తున్నారు. మీడియా ఫిల్ల‌ర్లుగా తామెందుకు ఉప‌యోగ‌ప‌డాల‌ని వీరంతా ఆవేద‌న చెందుతున్నారు. చిరు స్థాయి వ్య‌క్తుల గురించి రాసేట‌ప్పుడు క‌నీసం ఆలోచించ‌కుండా వార్త‌లు వెలుగులోకి తెస్తున్నార‌ని, అబ‌ద్ధాలు ప్ర‌చారం చేసి ల‌బ్ధి పొంద‌డం త‌గ‌ద‌ని వీరంతా హిత‌వు చెబుతూ చిరుకు మ‌ద్ద‌తు ఇస్తున్నారు. ఆన్లైన్ వేదిక‌లపై కూడా స్పందిస్తున్నారు. ఒక‌ప్పటి కాకుండా న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌లు వెంట‌వెంట‌నే చేప‌డుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో ఓ యుద్ధ‌మే న‌డుస్తోంది. ఈ  యుద్ధానికి తాను సైనికుడ్ని అవుతాన‌ని అంటున్నారు యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర కొండ.

 

మెగాస్టార్ చిరంజీవి ఓ ఉద్య‌మాన్ని మొద‌లుపెట్టారు. సామాజిక మాధ్య‌మాల్లో ఆ ఉద్య‌మం బాగా దూసుకుపోతోంది. గివ్ న్యూస్ నాట్ వ్యూస్ పేరిట చేసిన ఓ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ ఇన్ లో ఉంది. ట్విట‌ర్ వేదిక‌గా చేసిన ఈ యాష్ ట్యాగ్ మ‌రింత ప్రాచూర్యం ద‌క్కించుకుంది.తాను జ‌గ‌న్ ను క‌లిస్తే, ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల కోసమే క‌లిస్తే, త‌ప్పుడు వార్త‌లు సృష్టించి, విష‌యాన్ని పూర్తిగా ప‌క్క‌దోవ ప‌ట్టించ‌డం సమంజ‌సం కాద‌ని అంటున్నారు చిరు. ఇదే విష‌య‌మై ప‌దే ప‌దే విన్న‌విస్తున్నారు కూడా! అయిన‌ప్ప‌టికీ ప‌రిస్థితిలో మార్పు రాలేదు.