అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండకు యూత్ తో బీభత్సమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అది ఏ రేంజ్ లో ఉందో ప్రూవ్ అయ్యింది. విజయ్ దేవరకొండ హీరోగా పరశురాం డైరక్షన్ లో వస్తున్న సినిమా గీతా గోవిందం. ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ సినిమా మొత్తం గుంటూరు స్టూడెంట్స్ మధ్య లీక్ అయ్యింది. అమరావతి ప్రాంతంలో గీత గోవిందం మూవీ సీన్స్ వాట్స్ అప్ లో ట్రెండ్ అయ్యాయి.
దీనిపై క్లూ లాగగా సినిమా లీక్ అయినట్టు తెలిసింది. హైదరాబాద్ సినిమా ఎడిటింగ్ జరుగుతున్న యూనిట్ సభ్యుల నుండి ఈ సినిమా లీక్ అయ్యిందని కనిపెట్టారు. గుంటూరులో 17 మంది దాకా ఈ విషయమై అరెస్ట్ చేయడం జరిగింది. విజయ్ ఫాలోయింగ్ ఏంటన్నది ఈ సందర్భం చూస్తే తెలుస్తుంది. కాని ఇష్టమైన హీరో సినిమా ఇలా లీక్ చేయడం వల్ల అతని మార్కెట్ దెబ్బ తినే అవకాశం ఉంది.
అంతేకాదు అది చట్టరీత్యా నేరం మరి ఈ చిన్న లాజిక్ విజయ్ రౌడీ గ్యాంగ్ ఫ్యాన్స్ ఎలా మిస్ అయ్యారో తెలియలేదు. ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ లో కూడా సినిమా లీక్ పై చిత్రయూనిట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ లీక్ ఎఫెక్ట్ సినిమా మీద ఎంతవరకు పడుతుంది అన్నది మాత్రం రిలీజ్ నాడు తెలుస్తుంది.