ఎన్టీఆర్ ను ఢీ కొడుతున్న విజయ్

-

యువ సంచలనం విజయ్ దేవరకొండ రీసెంట్ గా గీతా గోవిందం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. 16 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైన ఆ సినిమా 100 కోట్ల గ్రాస్ తో సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ టాక్సీవాలా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఇదే కాకుండా కోలీవుడ్ లో విజయ్ చేస్తున్న నోటా మూవీ కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. తెలుస్తున్న సమాచారం ప్రకారం నోటా సినిమా దసరా బరిలో ఉండబోతుందట.

ఆల్రెడీ దసరాకి యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అక్టోబర్ 11న అరవింద సమేత రిలీజ్ అవనుంది. అయితే ఈ సినిమాకు పోటీగా విజయ్ నోటా ఒక వారం ముందే బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధమైంది. అక్టోబర్ 5న నోటా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఆనంద్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న నోటా తెలుగు, తమిళ బాషల్లో రిలీజ్ అవనుంది.

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ రాజకీయ నేతగా కనిపిస్తాడని అంటున్నారు. గీతా గోవిందం సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న విజయ్ ఎన్.టి.ఆర్ సినిమాతోనే పోటీకి వస్తున్నాడు. మరి దసరా విజయం ఎవరి ఖాతాలో పడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news